పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వీరంగం సృష్టించారు. సాక్షి వీడియో జర్నలిస్ట్ నానిపై జలీల్ ఖాన్ దౌర్జన్యం చేశారు. తన కోడలితో వివాదం జరుగుతుండటంతో జలీల్ ఖాన్ గురువారం సీపీ కార్యాలయానికి వచ్చారు. ఎమ్మెల్యే తనకు న్యాయం జరపడంలేదని కోడలు మెహమూదా సీపీని ఆశ్రయించారు. దీనిపై సీపీ ఆదేశాల ప్రకారం డీసీపీ రాజకుమారి ఇరువర్గాలను పిలిపించారు.