'మళ్లీ వైఎస్ఆర్ సువర్ణయుగం వస్తుంది' | ysrcp leaders takes on jaleel khan | Sakshi
Sakshi News home page

'మళ్లీ వైఎస్ఆర్ సువర్ణయుగం వస్తుంది'

Published Wed, Mar 23 2016 2:00 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

'మళ్లీ వైఎస్ఆర్ సువర్ణయుగం వస్తుంది' - Sakshi

'మళ్లీ వైఎస్ఆర్ సువర్ణయుగం వస్తుంది'

విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్  మోహన్ రెడ్డి సీఎం అయితే రాష్ట్రంలో వైఎస్ఆర్ సువర్ణయుగం వస్తుందని ఆ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు. తాగునీటి ప్రాజెక్టులతో వస్తున్న కమీషన్లతో చంద్రబాబు అభివృద్ధి చెందుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసి వెళ్లామని.... కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని పార్టీ మారిన ఎమ్మెల్యేలపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు.

బుధవారం విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఆ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, మేకా ప్రతాప్ అప్పారావు, కె.పార్థసారథి, వంగవీటి రాధా, గౌతంరెడ్డి, కార్పొరేటర్లు సమావేశమయ్యారు. అనంతరం గౌతంరెడ్డి మాట్లాడుతూ... కృష్ణానదిలో నీరు ఎలా ఎండిపోతుందో... రేపు టీడీపీ కూడా అలాగే ఎండిపోతుందని ఎద్దేవా చేశారు. అలాంటి పార్టీలోకి జలీల్ఖాన్ వెళ్లారన్నారు.

ఆయన పార్టీని వీడినా... కార్యకర్తలు మాత్రం పార్టీలోనే ఉన్నారని స్పష్టం చేశారు. అలాగే వంగవీటి రాధా మాట్లాడుతూ... దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. మళ్లీ గెలవాలని జలీల్ ఖాన్కి వంగవీటి రాధా సవాల్ విసిరారు. జలీల్ఖాన్ పార్టీ వీడి వెళ్లడం వల్ల పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని మాజీ మంత్రి, కె.పార్థసారథి వ్యాఖ్యానించారు. గన్మాన్, డ్రైవర్, అతని పీఏ మాత్రమే జలీల్ఖాన్ వెంట వెళ్లారని... కార్యకర్తలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని పార్థసారథి పేర్కొన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement