విజయవాడ: నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వీడియో జర్నలిస్ట్ బి.నానిపై ఎమ్మెల్యే జలీల్ ఖాన్ దాడి చేయడంపై మీడియా ప్రతినిధులు సూర్యారావుపేట పీఎస్‌లో సౌత్ ఏసీసీ రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. జలీల్ ఖాన్, ఏడీసీపీ నవాబ్ జాన్‌ల వ్యవహారశైలిని పాత్రికేయ సంఘాలు ఖండించాయి. తక్షణం దీనిపై చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎన్ చలపతిరావు డిమాండ్ చేశారు.
సాక్షి వీడియో జర్నలిస్ట్ నానిపై ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పోలీసుల సమక్షంలోనే దౌర్జన్యం చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని మండిపడ్డారు. ఈ దుశ్చర్యను ప్రింట్ & ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్ జాప్) ఖండించింది. విజయవాడ సీపీ కార్యాలయ ప్రాంగణంలోనే ఇలాంటి సంఘటన జరగటం బాధాకరమని, పోలీస్ ఉన్నతాధికారులు తక్షణం స్పందించి కారకులపై చర్యలు తీసుకోవాలని పెన్ జాప్ రాష్ట్ర సంఘ అధ్యక్షులు బడే ప్రభాకర్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment