సాక్షి జర్నలిస్ట్‌పై జలీల్ ఖాన్ వీరంగం | MLA Jaleel Khan attacks on sakshi Journalist | Sakshi
Sakshi News home page

సాక్షి జర్నలిస్ట్‌పై జలీల్ ఖాన్ వీరంగం

Published Thu, Jan 24 2019 3:17 PM | Last Updated on Thu, Jan 24 2019 3:55 PM

MLA Jaleel Khan attacks on sakshi Journalist - Sakshi

సాక్షి, విజయవాడ: పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వీరంగం సృష్టించారు. సాక్షి వీడియో జర్నలిస్ట్ నానిపై జలీల్ ఖాన్ దౌర్జన్యం చేశారు. తన కోడలితో వివాదం జరుగుతుండటంతో జలీల్ ఖాన్ గురువారం సీపీ కార్యాలయానికి వచ్చారు. ఎమ్మెల్యే తనకు న్యాయం జరపడంలేదని కోడలు మెహమూదా సీపీని ఆశ్రయించారు. దీనిపై సీపీ ఆదేశాల ప్రకారం డీసీపీ రాజకుమారి ఇరువర్గాలను పిలిపించారు. 

ఈ సందర్భంగా సీపీ కార్యాలయానికి వస్తుండగా జలీల్ ఖాన్‌ను సాక్షి కెమేరామెన్ నాని చిత్రీకరించారు. దీంతో జలీల్‌ఖాన్‌ బూతులతో దుర్బాషలాడుతూ నానిపై దౌర్జన్యానికి దిగారు. ఏడీసీపీ నవాబ్ జాన్, సీఐ ఉమా మహేశ్వరరావు సమక్షంలోనే కెమెరామెన్‌ను చేయి మెలిపెట్టి కెమెరా గుంజుకున్నారు. ఎమ్మెల్యేకు మద్దతుగా ఆయన అనుచరులు వీరంగం సృష్టించారు. ఇంత జరుగుతున్నా పోలీసు అధికారులు ఎమ్మెల్యేను నిలువరించేందుకు ప్రయత్నించలేదు. ఏడీసీపీ నవాబ్ జాన్ స్వయంగా కెమెరాలో చిత్రీకరించిన విజువల్స్‌ను డిలీట్ చేశారు. పాత్రికేయులు సీపీ కార్యాలయం వద్ద ఆందోళన చేయడంతో కెమెరామెన్‌ను పోలీసులు విడిచిపెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement