
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ పెద్దలు తనను అణగదొక్కాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సోమవారం ఉండవల్లిలోని తన నివాసం వద్ద ముస్లింలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్నారు.
న్యాయం చేయాలని కోరుతున్న తమపై ఎదురుదాడి చేస్తోందని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించే వరకూ పోరాటం చేస్తామన్నారు. బీజేపీ తప్పుడు విధానాలు అనుసరిస్తోందన్నారు. మైనారిటీ కోటాలో జలీల్‌ఖాన్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఈ సందర్భంగా ముస్లిం నేతలు చంద్రబాబును కోరారు.ఏపీకి హోదా ఇస్తానని కాంగ్రెస్ పార్టీ కూడా ప్లీనరీలో చెప్పిందని, అలాంటప్పుడు కేంద్రానికి ఉన్న అభ్యంతరం ఏమిటని ఎంపీలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎం ప్రశ్నించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ యూ టర్న్ ఎందుకు తీసుకున్నాడో అందరికీ తెలుసన్నారు.