
'టీడీపీ ఎమ్మెల్యేలే మా పార్టీలోకి వస్తున్నారు'
తమ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారన్న వార్తలను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జలీల్ ఖాన్ ఖండించారు. బుధవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ... టీడీపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్లో చోటు దక్కదని భావిస్తున్న ఎమ్మెల్యేలు ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ వైపు చూస్తున్నారని...తమ పార్టీలోకి వచ్చేందుకు వారంత సిద్ధంగా ఉన్నారని జలీల్ ఖాన్ ఈ సందర్బంగా గుర్తు చేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో 67 అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీ వందకు పైగా స్థానాలను గెలుచుకుంది. జూన్ 8న ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం విదితమే. కాగా అధికారంలోకి రానున్న టీడీపీలోకి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారంటూ ఇటీవల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జలీల్ ఖాన్పై విధంగా స్పందించారు.