సాక్షి, విజయవాడ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార టీడీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. టికెట్ల లొల్లి రోజురోజుకీ రాజుకుంటోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జలీల్‌ఖాన్ కుమార్తె షభానా ఖాతూన్‌ను ఖరారు చేయడంపై మాజీ మేయర్ మల్లికా బేగం అభ్యంతరం తెలిపారు. తాను 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధం కాగా, తనకు ఓటేయరాదని జలీల్ ఖాన్ మతపెద్దల చేత ఫత్వా జారీ చేయించారని మల్లికాబేగం మండిపడ్డారు. ఇప్పుడు జలీల్ ఖాన్ కుమార్తె వియవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు సిద్ధం అవుతోందనీ, కాబట్టి ఆమెకు వ్యతిరేకంగా ఫత్వా జారీచేయాలని డిమాండ్ చేశారు.
తనను రాజకీయాల్లో ఉండకూడదని 2009లో ఫత్వా జారీ చేసిన కుల పెద్ద మఫ్తి మౌలానా అబ్ధుల్ ఖదీర్‌కు వినతి పత్రం సమర్పించేందుకు ఆమె ఇందాద్ ఘర్‌కు వెళ్లారు. మత పెద్ద అందుబాటులో లేకపోవడంతో అతని ఇంటి ముందే బైఠాయించి నిరసన తెలిపారు. మహిళలు రాజకీయాలలో ఉండకూడదని ఫత్వా జారీ చేసిన కుల పెద్దలు.. జలీల్‌ఖాన్ విషయంలో స్పందించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment