
త్వరలోనే టీడీపీ సర్కార్ కుప్పకూలుతుంది
అన్ని రంగాల్లో విఫలమైన తెలుగుదేశం ప్రభుత్వం త్వరలోనే కుప్పుకూలే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిప్రాయపడింది.
హైదరాబాద్ : అన్ని రంగాల్లో విఫలమైన తెలుగుదేశం ప్రభుత్వం త్వరలోనే కుప్పుకూలే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిప్రాయపడింది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ప్రభుత్వం నిలబెట్టుకునే పరిస్థితి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ ఆరోపించారు. బడ్జెట్‌లో దేనికీ కేటాయింపులు సరిగ్గా లేవని.. వాటికి సమాధానం చెప్పలేకే సభలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని జలీల్‌ఖాన్ విమర్శించారు.