విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ఖాన్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం తిరుపతిలో నిప్పులు చెరిగారు.
తిరుపతి : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ఖాన్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం తిరుపతిలో నిప్పులు చెరిగారు. జలీల్ ఖాన్ టీడీపీ కార్యాలయం ఎదుట కాపలాకుక్కలాంటి వారని ఆయన అభివర్ణించారు. జలీల్ఖాన్ వ్యాఖ్యలపై తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు. జలీల్ ఖాన్ బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు.