
'సీఎం సమైక్యవాదినంటూనే మోసం చేస్తున్నారు'
విజయవాడ: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదినంటూనే ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత జలీల్ ఖాన్ మండిపడ్డారు. ఉద్యోగస్తులు చేస్తున్న సీమాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చడానికి సీఎం యత్నిస్తున్నారని విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిరణ్ అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారా?లేక సమైక్యాంధ్రా ముసుగులో విభనకు సహకరిస్తున్నారా?అని ప్రశ్నించారు.
సీమాంధ్రులు సమైక్యంగా ఉద్యమిస్తుంటే సీఎం మాత్రం దశల వారిగా అణదొక్కుతున్నారని తెలిపారు. సమైక్యత కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ మాత్రమేనని జలీల్ ఖాన్ తెలిపారు.