‘ఇబ్బంది కలిగితే ఫాలో అవ్వొద్దు’ | Tapsee Doesn't Want To Waste Her Time On Rangoli Sasti Copy Tweet | Sakshi
Sakshi News home page

‘ఇబ్బంది కలిగితే ఫాలో అవ్వొద్దు’

Published Fri, Jul 5 2019 7:36 PM | Last Updated on Wed, Aug 21 2019 10:25 AM

Tapsee Doesn't Want To Waste Her Time On Rangoli  Sasti Copy Tweet - Sakshi

తనపై కంగనా రనౌత్‌ చెల్లెలు రంగోలీ చేసిన విమర్శలను నటీ తాప్సీ చాలా కూల్‌గా కొట్టిపారేసింది. ‘జీవితం చాలా చిన్నది. ప్రస్తుతం నా జీవితం ఎంతో సాఫీగా సాగుతోంది.  ఇలాంటి విషయాలపై మాట్లాడి నా సమయాన్ని వృథా చేయాలనుకోవడంలేదు’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఎప్పుడూ తన ట్వీట్‌లతో వార్తల్లో నిలిచే కంగనా రనౌత్‌ చెల్లెలు తాజాగా తాప్సీని ఉద్దేశించి చేసిన ట్వీట్‌ బాలీవుడ్‌లో దుమారం రేపింది. ‘జడ్జ్‌మెంటల్‌ హై క్యా’ సినిమా ట్రైలర్‌ చూసిన నటీ తాప్సీ ట్విట్టర్‌లో ‘ట్రైలర్‌ చాలా బావుంది. సినిమాపై మొదటి నుంచి ఉన్న అంచనాలకు తగ్గట్లుగానే ఉంది’ అని పోస్ట్‌ చేసింది.

వెంటనే స్పందించిన రంగోలీ ‘కొంతమంది కంగనాను కాపీ కొట్టి వాళ్ల దుకాణం నడుపుతుంటారు. ట్రైలర్‌ చూసి అందరూ ప్రశంసిస్తారు. కానీ కంగనా నటనను గుర్తించరు’ అని బదులిచ్చింది. బాలీవుడ్‌ నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌ ఈ విషయంపై రంగోలీని వారించగా.. ‘కంగనాకు డబుల్‌ ఫిల్టర్‌ అవసరమని చెప్పడానికి తాప్సీ ఎవరు? దయచేసి అసలు సమస్యను అర్థం చేసుకొండి’ అని ఆయనకు రీట్వీట్‌ చేసింది. ఇక తన చెల్లెలి వ్యాఖ్యల్ని కంగనా సమర్థించింది.

రంగోలి ట్వీట్లను చదివాను. మణికర్ణిక సినిమాపై మాట్లాడాలని రంగోలీ వరుణ్‌ ధావన్‌ను కోరగా.. అతను స్పందించక పోవడం, తాప్పీ నన్ను అతివాది, డబుల్‌ ఫిల్టర్‌ అవసరమని కామెంట్‌ చేయడంతో ఆమె కలత చెందింది. అనురాగ్ తాప్సీని ఎలాగైతే సమర్థిస్తున్నాడో, అలానే నా సోదరి కూడా నన్ను సమర్థిస్తోంది. ఆమె ట్వీట్లతో ఎవరికైనా ఇబ్బంది కలిగితే.. ఆమెను ట్విట్టర్‌లో ఫాలో చేయడం మానుకోండి’ అని కంగనా చెప్పుకొచ్చారు. కంగనా, రాజ్‌కుమార్‌ రావు నటించిన ఈ చిత్రానికి మొదటగా ‘మెంటల్‌ హై క్యా’ అనే టైటిల్ నిర్ణయించారు‌. సెన్సార్‌ బోర్డు విధించిన ఆంక్షల కారణంగా ప్రస్తుతం ‘జడ్జ్‌మెంటల్‌ హై క్యా’ అని పేరు మార్చారు. ఈ చిత్రం జూలై 26వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement