అమితాబ్‌ను తాప్సీ వెక్కిరించిందా?
అమితాబ్ బచ్చన్ అంటే బాలీవుడ్ దిగ్గజం. ఆయనంటే ప్రతి ఒక్కరికీ ఎక్కడలేని గౌరవం ఉంటుంది. అంతదూరంలో పెద్దాయన కనిపించగానే ఎదురెళ్లి మరీ పాదాభివందనాలు చేస్తారు. కానీ ఇటు టాలీవుడ్‌లోను, అటు బాలీవుడ్‌లోను సినిమాలు చేస్తున్న హీరోయిన్ తాప్సీ పన్ను మాత్రం అలాంటి అమితాబ్ బచ్చ్‌ను వెనకాల నుంచి వెక్కిరించింది!! అంత ధైర్యం ఆమె ఎలా చేసిందని అనుకుంటున్నారా? ఆ విషయాన్ని స్వయంగా అమితాబ్ బచ్చనే తన ట్విట్టర్ ద్వారా వివరించారు.
షూజిత్ సర్కార్ దర్శకత్వంలో వస్తున్న 'పింక్' సినిమా షూటింగ్ జరుగుతుండగా తాప్సీతో పాటు మరికొందరు కలిసి కెమెరా వైపు చూస్తూ సరదాగా నాలుక బయటపెట్టి, చిత్రమైన పోజులతో వెక్కిరిస్తున్నట్లుగా ఫొటో తీయించుకున్నారు. అయితే సరిగ్గా అదే సమయానికి అమితాబ్ బచ్చన్ లాయర్ దుస్తులలో మేకప్‌లో ఉండి, సీరియస్‌గా స్క్రిప్టు చూసుకుంటున్నారు. అనుకోకుండా వీళ్లు తీయించుకున్న ఫొటో ఫ్రేములోకి అమితాబ్ కూడా వచ్చేశారు. ఇదే విషయాన్ని ఆ ఫొటోతో సహా అమితాబ్ ట్వీట్ చేశారు.
T 2238 - And then you get photobombed by your colleagues !! PINK on set pic.twitter.com/1rIObTEetP
— Amitabh Bachchan (@SrBachchan) 26 April 2016