తాప్సీ
తాప్సీ కెరీర్ ప్రజెంట్ ఎంత స్పీడ్‌గా దూసుకెళ్తోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కానీ తాప్సీ మాత్రం జీవితాంతం నటిగా కొనసాగే ఆలోచన లేదని చెబుతున్నారు. ‘‘ప్రజెంట్ నేను పైకి ఎదుగుతున్నానంటే మరెవరో కిందకు దిగుతున్నట్లే. భవిష్యత్‌లో నా వంతు రాదని గ్యారంటీ ఏంటి? అందుకే నేను జీవితాంతం నటిగా కొనసాగలని అనుకోవడం లేదు. నన్ను ఆడియన్స్ ప్రోత్సహించినంత వరకు, నాకు వస్తున్న పాత్రలు ఎగై్జటింగ్ అండ్ చాలెంజింగ్‌గా ఉన్నంత వరకు మాత్రమే సినిమాలు చేస్తా.
అలా కుదరడం లేదని నా మనుసు నాకు చెప్పిన నాడు సినిమాలు ఆపేస్తా’’ అని చెప్పుకొ చ్చారు తాప్సీ. ఇక సినిమాల విషయానికి వస్తే... హిందీలో తాప్సీ నటించిన ‘సూర్మ, ముల్క్, మన్‌మర్జియాన్’ వంటి సినిమాలతో పాటుగా ఆమె తెలుగులో చేసిన ‘నీవెవరో’ కూడా ఈ ఏడాదే రిలీజైన సంగతి తెలిసిందే. మరో చిత్రం ‘తడ్కా’ విడుదలకు సిద్ధం అవుతోంది. అలాగే ‘పింక్’ సినిమా తర్వాత అమితా»Œ æబచ్చన్, తాప్సీ కలిసి నటిస్తున్న ‘బద్లా’ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 22న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment