
టాలీవుడ్‌లో ఈ ఏడాది సంచలనం రేపిన సినిమా ‘ఆర్‌ఎక్స్ 100’. చిన్న సినిమాగా వచ్చి పెద్ద సక్సెస్ కొట్టింది. ఈ మూవీలో బోల్డ్ కంటెంట్ ఉందంటూ ఎన్ని విమర్శలు వచ్చినా.. అవి సినిమా సక్సెస్‌ను ఆపలేకపోయాయి. ఇక ఇలాంటి సంచలనం సృష్టించిన సినిమా వస్తే.. ఊరికే ఉంటారా? ఇతరా భాషల వాళ్లు రీమేక్ అంటూ ఎగబడతారు.
ఇప్పటికే టాలీవుడ్ సెన్సేషన్ ‘అర్జున్‌రెడ్డి’ని తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తుండగా... ‘ఆర్‌ఎక్స్ 100’ను ఆది పినిశెట్టి హీరోగా తమిళంలో తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ చిత్రంలో హీరో పాత్రను డామినేట్ చేస్తూ.. హీరోయిన్ పాత్ర ఉంటుంది. మరి అలాంటి పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న చర్చ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. ఆదితో ఇదివరకే నటించిన తాప్సీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించబోతోందని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. ఇక తాప్సీ.. పాయల్ రాజ్‌పుత్‌ను మరిపించేలా ఘాటు సీన్లలో ఏ మేరకు నటిస్తుందో చూడాలి. ‘గుండెల్లో గోదారి’, విడుదలకు సిద్దంగా ఉన్న ‘నీవెవరో’ సినిమాల్లో ఆది, తాప్సీలు కలిసి నటించారు.
Comments
Please login to add a commentAdd a comment