ట్రోలింగ్‌.. దిమ్మ తిరిగే సమాధానమిచ్చిన తాప్సీ | Taapsee Pannu Best Reply To Troll Who Called Her Worst Looking Actress | Sakshi
Sakshi News home page

ట్రోలింగ్‌.. దిమ్మ తిరిగే సమాధానమిచ్చిన తాప్సీ

Published Sat, Jul 28 2018 2:54 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Taapsee Pannu Best Reply To Troll Who Called Her Worst Looking Actress - Sakshi

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిపోవడంతో భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ తమకు నచ్చని వ్యక్తులను కించపరచడం సర్వసాధారణమై పోయింది. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్‌ చేస్తూ ట్రోలింగ్‌ చేసే సంస్కృతి పెరిగిపోతోంది. కొందరు సెలబ్రిటీలు వీటిని పట్టించుకోరు. కానీ తాప్సీ వంటి డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ డైనమెట్స్‌ మాత్రం దిమ్మ తిరిగే సమాధానాలతో ట్రోలర్స్‌ నోరు మూయిస్తున్నారు. దక్షిణాది సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ ఢిల్లీ భామ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. బేబీ, నామ్‌ షబానా, పింక్‌ వంటి సినిమాలతో నటిగా విమర్శకుల ప్రశంసలు సైతం ద​క్కించుకున్నారు.

తాప్సీ అంటే నచ్చని ఓ వ్యక్తి మాత్రం... ‘తాప్సీ అసలు ఏమాత్రం అందంగా ఉండదు. ఆమె ముఖం చాలా చెత్తగా ఉంటుంది. నాకు తెలిసి మరో రెండు సినిమాల్లో మాత్రమే చూడగలం. ఆ తర్వాత బాలీవుడ్‌ తెరపై నుంచి కనుమరుగైపోతుందంటూ’  అక్కసు వెళ్లగక్కాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన తాప్సీ... ‘అయ్యె ఆల్‌రెడీ ముల్క్‌, మన్‌మర్జియాన్‌, బద్లా సినిమాల్లో నటించేశానే. మరో రెండు సినిమాలకు కూడా సైన్‌ చేశాను. మిమ్మల్ని చాలా నిరుత్సాహ పరిచాననుకుంటా. కానీ ఏం చేద్దాం మీరు ఇంకొంచెం బాధను దిగమింగాల్సిందే. ఓ నటిగా ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని పంచుతున్నాను. కేవలం ముఖాలు చూసే మీరు ఇకపై నటనను కూడా చూస్తే బాగుంటుంది. జై శ్రీరాం’ అంటూ వరుస ట్వీట్లతో అతడి నోరు మూయించారు. తాప్సీ సమాధానంతో సంతోష పడిన ఆమె అభిమానులు.. మేడమ్‌ మీరు ఎప్పుడూ ఇలాగే ధైర్యంగా ఉండాలి. మంచి సమాధానమిచ్చారంటూ ఆమెకు అండగా నిలిచారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement