
షూటింగ్ ముగిసిన తర్వాత కూడా ఆ పాత్ర ప్రభావం నుంచి త్వరగా బయటకు రాలేను అంటున్నారు తాప్సీ. ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. ‘సినిమాలో నేను పోషించబోయే పాత్ర కోసం నన్ను నేను చాలా త్వరగానే మార్చుకుంటాను. కానీ షూటింగ్ అయిపోయాక ఆ పాత్ర నుంచి అంత త్వరగా బయటపడలేను. కొంత కాలం పాటు ఆ పాత్ర ప్రభావం నా మీద అలానే ఉంటుంది. దీని వల్ల ఓ సారి ఓ వింత అనుభవం ఎదురయ్యింది నాకు. మన్మార్జియా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ సంఘటన జరిగింది’ అంటూ ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు తాప్పీ.
‘ఓ రోజు నేను మా చెల్లి డిన్నర్ కోసమని బయటకు వెళ్లాం. డ్రైవర్ కోసం ఎదురు చూస్తున్నాం. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి మా అనుమతి లేకుండా ఫోటోలు తీయడం ప్రాంరంభించాడు. దాంతో నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే ఆ వ్యక్తితో మర్యాదగా ఫోన్ తీసి లోపల పెట్టు.. లేదంటే దాన్ని పగలగొడతాను అని హెచ్చరించాను. సాధారణంగా నాకు ఎప్పుడు అంత కోపం రాదు. కానీ మన్మార్జియా చిత్రంలో నేను పోషించిన రూమి పాత్ర ప్రభావంతో అలా ప్రవర్తించాను. నన్ను చూసి మా చెల్లి కూడా ఆశ్చర్యపోయింది’ అన్నారు తాప్పీ. ప్రస్తుతం మిషన్ మంగళ్ సినిమాతో బిజీగా ఉన్నారు తాప్సీ.
Comments
Please login to add a commentAdd a comment