Taapsee Mishan Impossible Movie Release Date Announced - Sakshi
Sakshi News home page

Taapsee Pannu Mishan Impossible Movie: తాప్సీ 'మిషన్ ఇంపాజిబుల్'.. విడుదల తేది ప్రకటించిన మేకర్స్​

Published Mon, Feb 28 2022 7:09 PM | Last Updated on Mon, Feb 28 2022 7:33 PM

Taapsee Pannu Mishan Impossible Movie Release Date Announced - Sakshi

'ఝుమ్మంది నాదం' చిత్రంతో వెండితెర‌కు హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన తాప్సీ ప‌న్ను అతి తక్కువ కాలంలోనే టాప్​ హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకుంది. మంచి సినిమాలు ఎంపిక చేసుకుంటూ తనదైన నటనతో టాలీవుడ్​లో వచ్చిన క్రేజ్​తో స‌డ‌న్‌గా బాలీవుడ్‌కు మ‌కాం మార్చింది. అక్కడ వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ తానేంటో నిరూపించుకుంటోంది. అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. చాలా కాలం తర్వాత తాప్సీ తెలుగులో చేస్తున్న సినిమా 'మిషన్​ ఇంపాజిబుల్'​. 

'ఏజెంట్​ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేం స్వరూప్​ ఆర్​ఎస్​జే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్​ పతాకంపై నిరంజన్​ రెడ్డి, అన్వేష్​ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను ఏప్రిల్​ 1న విడుదల చేస్తున్నట్లు ఒక పోస్టర్​ ద్వారా మేకర్స్ ప్రకటించారు. ఈ పోస్టర్​లో తాప్సీతోపాటు ముగ్గురు చిన్నారులు పరుగు తీస్తూ కనిపించారు. ఈ సినిమాలో మలయాళీ నటుడు హరీశ్ కీలక పాత్ర పోషిస్తుండగా మార్క్​ కె. రాబిన్​ సంగీతం అందిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement