ఆకట్టుకుంటోన్న ‘గేమ్‌ ఓవర్‌’  ట్రైలర్‌ | Taapsee Pannu Game Over Trailer Released | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటోన్న ‘గేమ్‌ ఓవర్‌’  ట్రైలర్‌

Published Thu, May 30 2019 4:31 PM | Last Updated on Thu, May 30 2019 4:49 PM

Taapsee Pannu Game Over Trailer Released - Sakshi

తన నటనతో ఆకట్టుకుంటూ వరుసగా హిట్స్‌ కొడుతూ బాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ దూసుకుపోతున్న తాప్సీ.. మరో థ్రిల్లింగ్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాది ప్రారంభంలో అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి నటించిన ‘బాద్లా’ సినిమాతో తాప్పీ మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘గేమ్‌ ఓవర్‌’ ట్రైలర్‌ను విడుదల చేశారు.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను రానా విడుదల చేశారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో తాప్సీ నటన ప్రధాన ఆకర్షణగా ఉండబోతోన్నట్లు తెలుస్తోంది. వైనాట్‌ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement