
నిర్మాతగా తాప్సీ?
కథానాయికలు నిర్మాతలుగా మారడం ఇప్పటి ట్రెండ్. మొన్న అనుష్క శర్మ నిర్మాతగా మారి ‘ఎన్‌హెచ్ 10’ తీసి విజయం సాధించారు. ప్రియాంకా చోప్రా కూడా ఓ సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నారు. తాజాగా తాప్సీ కూడా సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులను భయపెట్టిన ‘కాంచన’ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో కలిసి హిందీలోకి రీమేక్ చేయాలని తాప్సీ భావిస్తున్నారట!