
‘పద్మావత్’ తర్వాత దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఏం చేయబోతున్నారనే ఆసక్తి బాలీవుడ్ మొత్తం నిండి ఉంది. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను సల్మాన్ ఖాన్‌తో ప్లాన్ చేశారని తాజా వార్త. 19 ఏళ్ల క్రితం సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా రాయ్ జంటగా ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ అనే ప్రేమ కథను తెరకెక్కించారు సంజయ్ లీలా భన్సాలీ.
అయితే తాజా చిత్రం కూడా ప్రేమ కథే అని ప్రచారం జరుగుతోంది. కథను పూర్తి చేసి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట. ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఇందులో సల్మాన్ సరసన హీరోయిన్‌గా దీపికా పదుకోన్ నటిస్తారని టాక్. 19 ఏళ్ల తర్వాత మళ్లీ కలుస్తున్న సల్మాన్–సంజయ్‌ల కాంబినేషన్ అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.