
జోరుగా హుషారుగా...
‘జోరుగా హుషారుగా షికారు పోదమా... హాయి హాయిగా.. తియ్య తియ్యగా’ అనే పాట గురించి తాప్సీ, చార్మీకి తెలుసో తెలియదో కానీ.. ఈ పాటలోలానే ఈ ఇద్దరూ ఇటీవల జోరుగా షికారు చేశారు. నచ్చినవాళ్లతో షికారు చేస్తూ.. లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, ఈ ఇద్దరూ జాయింట్‌గా వెళ్లలేదు. తాప్సీ తన చెల్లెలు షగున్‌తో వెళ్తే, చార్మీ తన స్నేహితులతో వెళ్లారు. ఎంజాయ్‌మెంట్‌కి చిరునామా అనే పేరు తెచ్చుకున్న ఇండియాలోని ఓ ప్రదేశానికి చార్మి వెళ్తే, తాప్సీయేమో విదేశాలకు వెళ్లారు. ఈ ఇద్దరి విహార యాత్రలో చాలా కబుర్లే ఉన్నాయి...
చాలా చలిగా ఉంది బాబోయ్!
ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ తాప్సీ బిజీ బిజీగా ఉన్నారు. ఎప్పట్నుంచో చిన్న బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారు. ఆ బ్రేక్ పూర్తిగా నా చెల్లెలి కోసమే అంటున్నారామె. ఇటీవల బ్రేక్ తీసు కున్న ‘‘కొత్త ప్రయాణం.. కొత్త గమ్యం.. ఫ్లయిట్ జర్నీకి టైమ్ అవు తోంది. నేనెక్కడికి వెళుతున్నానో? ఊహించగలుగుతారా?’’ అని ఫేస్‌బుక్ ద్వారా చిన్న ట్విస్ట్ ఇచ్చారు. కాసేపటికి ‘‘న్యూయార్క్ వెళుతున్నా’’ అని స్పష్టం చేశారు. అలా ఈ మధ్య న్యూయార్క్‌లో ఈ అక్కాచెల్లెళ్ల సందడికి కొదవే లేదు.
ఆ నగరంలో అడుగుపెట్టినప్పటి నుంచీ తాము దిగిన ఫొటోల్లో కొన్నింటిని ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో పెట్టారు. అక్కడ అడుగుపెట్ట గానే ఓ పెద్ద వీధిలో ఫొటో దిగి, ‘‘చాలా చలిగా ఉంది బాబోయ్’’ అని పేర్కొన్నారు తాప్సీ. ఆ తర్వాత ఓ క్లబ్‌లో జరిగిన మ్యూజికల్ షోకి వెళ్లారు. రెండో రోజు బస్ జర్నీ చేశారు. గంటలు గంటలు షాపింగ్ చేశారు. కామెడీ సెల్లార్ అనే ప్రోగ్రామ్‌కి వెళ్లి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. మూడో రోజున అక్కడి ఫేమస్ సెంట్రల్ పార్క్‌కి వెళ్లారు.
అలాగే 102 అంతస్తులున్న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ బయట నిలబడి, తాప్సీ, షగున్ సెల్ఫీ దిగారు. అంతా బాగానే ఉంది కానీ, 9/11 మెమోరియల్ మ్యూజియమ్ దగ్గరకు వచ్చేటప్పటికీ నవ్వు మాయమైపోయిందనీ, చాలా బాధ అనిపించిందనీ అన్నారు. ఇంకా న్యూయార్క్‌లోని పలు ప్రదేశాలను సందర్శించారు. దాదాపు ఆరు రోజుల పాటు చెల్లెలు షగున్‌తో ఎంజాయ్ చేసి, ‘మళ్లీ ఇక్కడికి వచ్చేవరకు బై.. బై.. అమెరికా.. నెక్ట్స్ టైమ్ వాతావరణం బెటర్‌గా ఉండాలి’ అంటూ అమెరికాకు ముద్దుగా విన్నవించుకున్నారు తాప్సీ.
ప్రతి అందమైన విషయానికీ ఓ ఎండింగ్!
చార్మి ట్రిప్ గురించి చెప్పాలంటే... తను ఒకరిద్దరితో కాదు... దగ్గర దగ్గర పదిమందితో హాలీడే ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ఎంజాయ్‌మెంట్‌కి చిరునామా అని పేరు తెచ్చుకున్న గోవాకు ఇటీవల వెళ్లారామె. సాగర తీరాల్లో స్నేహితులతో కలిసి చార్మి ఏ రేంజ్‌లో సందడి చేస్తున్నారో ఫొటోలు చూస్తే అర్థమవుతోంది. గోవాలో దొరికే టేస్టీ టేస్టీ సీ ఫుడ్స్ ఓ పట్టు పట్టారు. ఈ హాలీడే ట్రిప్‌లో డైటింగ్ గురించి పట్టించుకోకూడదని ఫిక్స్ అయినట్లున్నారు.
అందుకే మొహమాటం లేకుండా లాగించేశారు. ‘‘ఒక్కోసారి ఆరోగ్యానికి ఏదైతే మంచిది అనుకుంటామో అదే చెడు చేస్తుంది కూడా’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు చార్మి. దానికి కారణం.. ఫుడ్ పాయిజన్ కావడమే. ‘‘ఫుడ్ పాయిజన్ అయిన రోజు రాత్రి కాళరాత్రే’’ అన్నారీ బ్యూటీ. పగటి పూట మాత్రమే కాదు.. అర్ధరాత్రి కూడా చార్మీ తన ఫ్రెండ్స్‌తో గోవా వీధుల్లో ఎంజాయ్ చేశారు. దాదాపు వారం రోజులు ఈ ట్రిప్‌ను ఎంజాయ్ చేసి, ‘ప్రతి అందమైన విషయానికీ ఓ ఎండింగ్’ ఉంటుంది అంటూ హాలీడే ట్రిప్ ఎండింగ్ గురించి పేర్కొన్నారామె.