జస్ట్ 14 డేస్ గ్యాప్‌లో రెండు సార్లు సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనున్నారు కథానాయిక తాప్సీ. ముందు హాకీ ప్లేయర్‌గా గ్రౌండ్‌లో దుమ్ము దులిపి, ఆ నెక్ట్స్ లాయర్‌గా కోర్టులో వాదిస్తారు. విషయం ఏంటంటే... హాకీ ప్లేయర్ సందీప్‌సింగ్ జీవితం ఆధారంగా షాద్ అలీ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘సూర్మ’ జూలై 13న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇందులో టైటిల్ రోల్‌లో దిల్జీత్‌సింగ్ నటించగా, ఫిమేల్ లీడ్ హార్‌ప్రీత్‌కౌర్ పాత్రలో తాప్సీ నటించారు. ఇక తాప్సీ లాయర్ ఆర్తీ పాత్రలో నటించిన చిత్రం ‘ముల్క్’. ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ కూడా చేశారు. ‘ముల్క్’ చిత్రాన్ని జూలై 27న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. అభినవ్ సిన్హా దర్శకత్వంలో రిషి కపూర్, ప్రతీక్ బబ్బర్, తాప్సీ, రజత్ కపూర్, అశుతోష్ రాణా, మనోజ్ పవ్వా, నీనా గుప్త ముఖ్య తారలుగా నటించారు.
ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పరువు, మర్యాదల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగనుంది. ఇప్పుడు అర్థం అయ్యింది కదా! 14డేస్‌లో గ్యాప్‌లో తాప్సీ ప్లేయర్‌గా, లాయర్‌గా ఎలా వస్తారో! అంతేకాదండోయ్... తాప్సీ నటించిన మరో రెండు హిందీ చిత్రాలు ‘తడ్కా, మన్‌మర్జియాన్’ కూడా రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. బీటౌన్ సరే.. మరి టీటౌన్ (తెలుగు)లో తాప్సీ సినిమాల గురించి అంటే.. అక్కడికే వస్తున్నాం. ఆది పినిశెట్టి, తాప్సీ, రితిక సింగ్ ముఖ్య తారలుగా తెలుగులో ఓ సినిమా రూపొందింది. ఈ సినిమా టైటిల్‌ను హీరో నానీ రేపు వెల్లడిస్తారు.
ఫస్ట్ ప్లేయర్.. నెక్ట్స్ లాయర్!
Published Wed, May 23 2018 12:37 AM | Last Updated on Wed, May 23 2018 12:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment