రెండు జీవితాలు గడపడం కష్టమే! | Brand Priyanka Chopra gets bigger, better and more bankable | Sakshi
Sakshi News home page

రెండు జీవితాలు గడపడం కష్టమే!

Published Mon, Mar 27 2017 11:26 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM

రెండు జీవితాలు గడపడం కష్టమే!

రెండు జీవితాలు గడపడం కష్టమే!

ఇండియాలో మూడు నెలలు.. యూఎస్‌లో మూడు నెలలు.. వేరే దేశాల్లో మిగతా నెలలు.. మొత్తం మీద ప్రియాంకా చోప్రా క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఇంత హడావిడి జీవితం ఎలా అనిపిస్తోంది? అని ఈ బ్యూటీని అడిగితే – ‘‘లైఫ్‌లో ఇంత బిజీ అవుతానని ఊహించలేదు. చేతినిండా పని ఉండటం లక్‌. కాకపోతే ఒక్కోసారి వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకోవడం కష్టమవుతోంది. రెండు జీవితాలకూ న్యాయం చేయడం కష్టం అనిపించినప్పుడల్లా కాసేపు ఆలోచిస్తా. పర్సనల్‌గా ముఖ్యమైన వాటికి టైమ్‌ కేటాయిస్తున్నాను.

ఆ పనులను వాయిదా వేసుకోవడంలేదు. ఎందుకంటే, కోట్లు సంపాదిస్తాం. వ్యక్తిగత జీవితం లేనప్పుడు ఆ సంపాదన ఏం చేసుకుంటాం?’’ అన్నారు. మీ తప్పులను అద్దంలో చూపించినట్లుగా చెప్పేవాళ్లు ఉన్నారా? అనే ప్రశ్న ప్రియాంక ముందుంచితే – ‘‘కొంతమంది ఉన్నారు. వాళ్లు నిర్మొహమాటంగా చెప్పేస్తారు. వాళ్ల అభిప్రాయాలను గౌరవిస్తాను. పొగిడేవాళ్లనే పక్కన పెట్టుకుంటే మనలో లోపాలు తెలియవు. అందుకే మొహం మీదే విమర్శించేవాళ్లతోనే స్నేహం చేస్తా’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement