Karate Kalyani Emotional Comments About Her Husband And Divorce, Deets Inside - Sakshi
Sakshi News home page

Karate Kalyani : 'విడాకులు తీసుకున్నా.. మరో పెళ్లి చేసుకోవాలనుంది, ప్రేమకోసం తపిస్తున్నా'

Published Fri, Dec 23 2022 3:17 PM | Last Updated on Fri, Dec 23 2022 5:08 PM

Karate Kalyani Emotional About Her Husband And Divorce - Sakshi

సినీ నటి కరాటే కల్యాణి గురించి ప్రత్యకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల్లో ఆమె బోల్డ్‌ పాత్రల ద్వారా గుర్తింపు పొందిన కరాటే కల్యాణ్‌ బిగ్‌బాస్‌ 4 ద్వారా మరింత ఫేంను సంపాదించుకుంది. ముక్కుసూటిగా మాట్లాడే కల్యాణి పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ మనసులో ఎంతో బాధ ఉందని చెబుతూ ఎమోషనల్‌ అయ్యింది. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు జరిగిన అవమానాలు, మాజీ భర్తతో చేదు సంఘటనల్ని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంది.

బతుకుదెరువు కోసం సినిమాల్లో నటిస్తున్నాను. చాలామంది నాలో బాబీనే చూశారు. కానీ నాణానికి మరోవైపు కూడా ఉందని చాలామందికి తెలియదు. నేను రియల్‌లైఫ్‌లో ఎంతోమందికి సహాయం చేశాను. ఇక నా వ్యక్తిగత జీవితానికి వస్తే.. పెళ్లి చేసుకున్నాక ఎన్నో కష్టాలు అనుభవించాను. అతను పెట్టిన టార్చర్‌ మాటల్లో చెప్పలేను. ఎంత పీక్స్‌కు వెళ్లిందంటే.. బేగంపేట వద్ద నడిరోడ్డుపై నామీద బట్టలు లాగేసి దారుణంగా ప్రవర్తించాడు.

అందరూ చూస్తుండగానే ద్రౌపది వస్త్రాపహరణం జరిగింది. ఇంక చాలా జరిగాయి. అయినా అతడిలో మార్పు కనిపించలేదు. తర్వాత విడాకులు తీసుకున్నాం. ఇప్పటికీ నిజమైన ప్రేమకోసం తపిస్తున్నాను. మరో పెళ్లి చేసుకోవాలనుంది అంటూ చెప్పుకొచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement