మౌనమేలనోయి! | No gossips for anushka sharma | Sakshi
Sakshi News home page

మౌనమేలనోయి!

Published Mon, Jun 15 2015 11:49 PM | Last Updated on Sun, Sep 3 2017 3:47 AM

మౌనమేలనోయి!

మౌనమేలనోయి!

ఆడవాళ్ల నోట్లో నువ్వు గింజైనా నానదు...అంటారు. అయితే గియితే ఇది నిజమే అయితే గనుక ఈ సామెత నుంచి అనుష్కశర్మను పూర్తిగా మినహాయించాలి. ఎందుకంటే ఎంత ప్రయత్నించినా, అనుష్క నుంచి అదనంగా ఒక్కమాట కూడా బయటికి రాదు. తన వ్యక్తిగత జీవితం గురించిన విషయాలను అయితే మరీ గోప్యంగా ఉంచుతుంది.
‘‘ఎందుకలా?’’ అని అడిగితే...ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందో అని నవ్వే సమాధానంగా చెబుతుంది అనుష్క. కొన్నిసార్లు మౌనాన్ని కూడా ఆశ్రయిస్తుంటుంది.
వ్యక్తిగత వివరాలను ఇతరులతో కాస్త ఎక్కువగా పంచుకోవడం వల్ల గతంలో అనుష్క చేదు అనుభవాలను ఎదుర్కోవలసి వచ్చిందని, ఇక అప్పటి నుంచి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడడం నేర్చుకుంది అనేది ఒక కథనం. అదేమీ కాదని, వ్యక్తిగత వివరాలను  ఎంత గోప్యంగా ఉంచితే, నటుల గురించి అంతగా ఆసక్తి పెరుగుతుందనేది అనుష్క ఫిలాసఫీ అని మరో కథనం. ఏది నిజమో ఏమిటో!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement