Karate Kalyani Gets Emotional Over Negative Comments On Her - Sakshi
Sakshi News home page

Karate Kalyani: అందుకే అందరూ నన్ను వ్యభిచారిణిలా చూస్తున్నారు: కరాటే కల్యాణి ఆవేదన

Published Fri, Dec 30 2022 8:57 PM | Last Updated on Sat, Dec 31 2022 8:47 AM

Karate Kalyani Gets Emotional Over Negative Comments On Her - Sakshi

సినీ నటి కరాటే కల్యాణి గురించి ప్రత్యకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాల్లో ఆమె బోల్డ్‌ పాత్రల ద్వారా గుర్తింపు పొందిన కరాటే కల్యాణ్‌ బిగ్‌బాస్‌ 4 ద్వారా మరింత ఫేంను సంపాదించుకుంది. ముక్కుసూటిగా మాట్లాడే కల్యాణి పైకి గంభీరంగా కనిపిస్తున్నప్పటికీ మనసులో ఎంతో బాధ ఉందని చెబుతూ ఎమోషనల్‌ అయ్యింది. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు జరిగిన అవమానాలు, చేదు సంఘటనల్ని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతరమైంది.

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘బతుకుదెరువు కోసమే తాను సినిమాల్లో నటిస్తున్నానని చెప్పింది. చాలామంది నాలో బాబీనే చూశారు. కానీ నాలో మరో కోణం కూడా ఉంది. నేను సంపాదించిన దాంట్లో కొంత భాగం సేవ కార్యక్రమాలకు వినియోగిస్తాను. పిల్లలను దత్తత తీసుకున్నాను. ఎంతోమందికి సాయం చేశాను. కానీ జనాలు అవేవి చూడటం లేదు. తెరపై నేను పోషించిన పాత్రలను బట్టి నిజ జీవితంలో కూడా నన్ను అలాగే ట్రీట్‌ చేస్తున్నారు.

చెప్పాలంటే నన్ను ఓ వ్యభిచారిగా చూస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు. అలాంటి కామెంట్స్‌ నన్ను చాలా బాధిస్తున్నాయి. అవి విన్నప్పుడు నాకు చాలా పెయిన్‌గా ఉంటుంది. నేను తెరపై నటించానంతే, నిజంగా చేయలేదు. బతుకు దెరువు కోసం అలాంటి రోల్స్‌ చేశాను. నాలోని మంచిని గుర్తించకుండా నాపై అసహ్యమైన కామెంట్స్‌ చేస్తుంటారు’ అంటూ కల్యాణి ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే తాను అలాంటి దాన్ని కాదని, ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది.

చదవండి: 
బాలయ్య ‘అన్‌స్టాపబుల్‌ షో’పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
రొమాంటిక్‌ సీన్స్‌లో హీరోలు అలా ప్రవర్తిస్తారు: తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement