చిరంజీవి
‘ప్రేమను పంచుదాం. కరోనాను కాదు’’ అంటోంది చిరంజీవి కుటుంబం. కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియమాలను ప్లే కార్డుల రూపంలో తెలుపుతూ ఓ ఫొటోను షేర్ చేశారు. ‘’ఇంట్లో ఉందాం.. యుద్ధం చేస్తాం. క్రిమిని కాదు ప్రేమను పంచుతాం. కాలు కదపకుండా కరోనాను తరిమేస్తాం. భారతీయులం ఒక్కటై భారత్‌ను గెలిపిస్తాం’’ అంటూ చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్, ఉపాసన, సుష్మిత, అల్లు శిరీష్, నిహారిక, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్∙తేజ్, శ్రీజ, కళ్యాణ్ దేవ్ ప్లే కార్డుస్ పట్టుకున్నారు.
‘‘నా జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే ఆలోచన లేదు’’ అంటున్నారు చిరంజీవి. తన బయోపిక్ గురించి ఇటీవల ఓ సందర్భంలో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘సినిమా ఇండస్ట్రీలో నా ప్రయాణం చాలామంది యాక్టర్స్‌కు ప్రేరణగా నిలిచింది. ఇండస్ట్రీలో చిరంజీవిగా ఎదగాలని చాలామంది అనుకుంటుంటారు. ఇది నాకు చాలా సంతోషాన్నిస్తుంది. కానీ నా జర్నీని వెండితెరపై ఓ ఆసక్తికరమైన బయోపిక్‌గా తెరకెక్కించడానికి కావాల్సినన్ని మలుపులు నా జీవితంలో లేవని నాకనిపిస్తోంది. అయితే ప్రస్తుతం నా ఆటోబయోగ్రఫీ (పుస్తకం)కి చెందిన వర్క్ జరుగుతోంది. అలాగే నా వ్యక్తిగత జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఓ డాక్యుమెంటరీగా తీయాలనే ఆలోచనలో ఉన్నాం’’ అని పేర్కొన్నారు.
ఆచార్యలో రామ్‌చరణ్
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ప్రొఫెసర్‌గా మారిన మాజీ నక్సలైట్ పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని టాక్. చిరంజీవి శిష్యుడి పాత్రలో కనిపిస్తారట రామ్‌చరణ్.
Comments
Please login to add a commentAdd a comment