క్లింటన్ జంటతో ట్రంపు దంపతులు
మెలానియ గ్లామర్ మోడల్. ట్రంప్ తొలిసారి 1998లో ఆమె 28 ఏళ్ల వయసులో న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో చూశాడు. అప్పటికి అతడు రెండో భార్యతోనూ విడిపోయాడు కానీ, విడాకులు తీసుకోలేదు. ఎవరీ అందగత్తె అని ఆరా తీశాడు. దేశవాళీ యువతి కాదు, స్లొవేనియా మోడల్ అని చెప్పారు. పరిచయం చేసుకున్నాడు. అంతకు రెండేళ్ల క్రితమే ఫ్యామిలీతో పాటు న్యూయార్క్ వచ్చినట్లు చెప్పింది మెలానియ. ఫోన్ నెంబర్ అడిగాడు. మెలానియ ఇవ్వలేదు! అప్పటికే అతడి పక్కన సెలీనా మిడెల్‌ఫార్ట్ అనే అమ్మాయి ఉంది. మెలానియా ఎక్కడికి వెళుతుంటే అక్కడికి వచ్చేస్తున్నాడు ట్రంప్. ఫస్ట్ టైమ్ ‘హోవార్డ్ స్టెర్న్ టీవీ షో’లో ఇద్దరి మధ్య ప్రేమ బయటపడింది. తర్వాత ఇద్దరూ పక్కపక్కనే బహిరంగంగా నడుస్తూ బయటపడ్డారు.
తమ అనుబంధం గురించి ట్రంప్ 2005లో ఓ టీవీ చానెల్‌లో మాట్లాడారు. ‘‘మా మధ్య వాదులాటలు ఉండవు. మా గురించి ప్రపంచం వాదులాటలు పెట్టుకోవడం తప్ప’’ అన్నారు. 2004లో వీళ్ల ఎంగేజ్‌మెంట్ అయింది. 2005లో పెళ్లి. 2006లో మెలానియ తల్లి అయింది. కొడుకు పుట్టాడు. మెలానియకు 2005లో అమెరికన్ పౌరసత్వం లభించింది. మెలానియ డిగ్రీ చదువును మధ్యలోనే ఆపేశారు. ఫ్యాషన్ మోడలింగ్‌లోకి వచ్చేశారు. స్లొవేనియా, సెర్బియా, ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్.. భాషలు మాట్లాడతారు మెలానియ. ట్రంప్‌కి, మిలానియకు ఒకడే సంతానం. బ్యారన్ ట్రంప్. ఇవాంక ట్రంప్ మొదటి భార్య ఇవానా కూతురు.
Comments
Please login to add a commentAdd a comment