మాటల తూటాలతో జాతీయ భావాన్ని రెచ్చగొట్టినా .. ప్రపంచ దేశాలపై నోరు పారేసుకొని వివాదాల కుంపట్లు రాజేసినా..దూకుడు నిర్ణయాలతో సొంత పార్టీలోనూ, మీడియాలోనూ విమర్శలు ఎదుర్కొన్నా.. అదరలేదు. బెదరలేదు. ఎప్పుడూ తలవంచలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ .. చైనాతో వాణిజ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరుకున్న సమయంలో.. ఎన్నారైలు హెచ్1బీ వీసా సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తరుణంలో.. కశ్మీర్ అంశంలో మూడోవ్యక్తి జోక్యాన్ని సహించబోమని భారత్ తేల్చి చెప్పిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా భారత్ గడ్డపై అడుగు పెడుతున్నారు. విపక్షాల అభిశంసన తీర్మానాన్ని దీటుగా ఎదుర్కొన్న విజయ దరహాసంతో సారొస్తున్నారొస్తున్నారు.
నమస్తే ట్రంప్
Published Sun, Feb 23 2020 8:06 AM | Last Updated on Thu, Mar 21 2024 8:24 PM
Advertisement
Advertisement
Advertisement