వరద కష్టాల్లోనూ.. మెలానియా సోకులు!
వాషింగ్టన్: వరద ప్రాంతాలను సందర్శించడానికి వెళ్లిన సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్ మరీ సోకులకు పోవడం విమర్శలపాలైంది. ఇటీవల తీవ్ర వర్షాలు, వరదలతో ఛిన్నాభిన్నం అయిన టెక్సస్‌ను మంగళవారం ట్రంప్, ఆయన భార్య మెలానియా సందర్శించారు. ట్రంప్ హయాంలో అతిపెద్ద విలయంగా భావిస్తున్న టెక్సస్ విపత్తు నేపథ్యంలో అధ్యక్షుడు, ఆయన సతీమణి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యంత ఫ్యాషనబుల్‌గా కనిపించడానికి ట్రంప్, మెలానియా ప్రయత్నించడం అమెరికన్లను విస్తుపోయేలా చేసింది. ముఖ్యంగా మెలానియా మరీ ఎత్తుగా ఉన్న హైహిల్స్ వేసుకోవడం అందరి దృష్టి ఆకర్షించింది. టెక్సస్ వరద కష్టాలు ముంచెత్తిన సందర్భంలోనూ ట్రంప్, మెలానియా ఇలా సోకులకు పోవడం ఏమిటని అమెరికన్ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
టైలర్డ్ కాప్రి ప్యాంట్, ఆర్మీ ఆకుపచ్చ రంగు బాంబర్ జాకెట్, ఏవియేటర్ సన్‌గ్లాసెస్, స్కై-హై హిల్స్ షూస్‌ను మెలానియా ధరించగా.. ట్రంప్ హుడెడ్ రెయిన్ జాకెట్, ఖాకీ రంగు ప్యాంటు, ముదురురంగు బూట్లు వేసుకున్నారు. వీరి సోకులపై ట్విట్టర్‌లో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'మెలానియా అచ్చం వరదలను చూస్తున్న బార్బీలా ఉంది' అని రచయిత మారియా డెల్ రుసో ట్వీట్ చేయగా.. 'టెక్సస్ వాసులారా ఆందోళన చెందకండి. సాయం అందుతుంది. మెలానియా తుఫాన్ అంత ఎత్తున హైహీల్స్ వేసుకుంది' అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
Melania over here looking like Flood Watch Barbie. Pretty sure Loubs aren't waterproof, babes. https://t.co/XCAexsWpsc
— Maria Del Russo (@maria_delrusso) August 29, 2017
And here we have Melania Trump modeling what NOT to wear to a hurricane: 5-inch stilettos.
— Holly O'Reilly (@AynRandPaulRyan) August 29, 2017
How out of touch can you be? pic.twitter.com/tZR8o3dYxY