
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో తనకు పది నెలల శారీరక సంబంధం ఉందని ప్రముఖ మేగిజిన్ ప్లేబోయ్ మోడల్ కరెన్ మెక్ డౌగల్ చెప్పారు. 2006లో తమ మధ్య సంబంధాలు ఏర్పాడ్డాయని, ఆ బంధం పెళ్లి వరకు తీసుకెళుతుందని కూడా తాను భావించినట్లు తెలిపారు. అయితే, ఇప్పుడు తానేదో ఆశించి ఈ విషయం చెప్పడం లేదని అన్నారు. ట్రంప్‌తో తనకు శారీరక సంబంధం ఉందని ప్రకటించిన తర్వాత తొలిసారి సీఎన్‌ఎన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఆండర్సన్ కూపర్ నిర్వహించే 360 డిగ్రీస్ అనే కార్యక్రమంలో ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె పలు విషయాలు తెలిపారు. ‘అప్పుడు నేను ట్రంప్‌తో గాఢంగా ప్రేమలో మునిగిపోయాను. ట్రంప్ కూడా తన ప్రేమను ఎన్నోసార్లు చెప్పారు. ప్రతిసారి కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ ట్రంప్ చెప్పేవారు. పది నెలలపాటు మా సంబంధం కొనసాగింది. అది పెళ్లి వరకు వస్తుందని కూడా నేను ఆశపడ్డాను’ అని చెప్పారు. అంతేకాదు, తాను ట్రంప్ భార్య మిలానియాకు క్షమాపణలు చెప్పారు. ‘ఇంతకంటే నేను ఏం చెప్పగలను.. అందుకే నన్ను క్షమించు.. నన్ను క్షమించు..ఇలా నేను ఇంకెప్పుడు చేయకూడదని అనుకుంటున్నాను’ అని దౌగల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment