
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలను, దేశాధినేతలను కూడా వదిలిపెట్టట్లేదు. ఇటీవల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో సెయింట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. పదిరోజుల పోరాటం అనంతరం ఆయన కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే అతని సతీమణి సైమండ్ ప్రస్తుతం గర్భిణీ. ఆమెకు కూడా కరోనా లక్షణాలు ఉన్నాయంటూ వార్తలు వినిపించాయి. (అమెరికాలో భారీగా కోవిడ్ మృతులు)
ఈ నేపథ్యంలో ఈ దంపతులను ఉద్దేశించి అమెరికా ప్రథమ మహిళ, అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా వైట్‌హౌస్ నుంచి లేఖ రాశారు. వారి ఆరోగ్యం కుదుటపడాలని, దంపతులిద్దరూ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి బాగు కోసం తమ దేశమంతా ప్రార్థనలు చేస్తోందని చెప్పుకొచ్చారు. కాగా అమెరికాలో గురువారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,54,343కు చేరుకోగా, మరణాలు 33 వేల మార్కును దాటేశాయి. ఒక్క న్యూయార్క్‌లోనే ఇప్పటి వరకు 16,251 మంది చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. (ఇంటి నుంచి ఇలా సులువు)
Comments
Please login to add a commentAdd a comment