అమెరికా, రష్యా అధ్యక్షుల సమావేశంలో మెలానియా ట్రంప్
ఫిన్‌లాండ్: అమెరికా మొదటి మహిళ మెలానియా ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిత్ పుతిన్‌ను చూసి భయంతో వణికిపోయారు. అతనితో కరచాలనం చేయగానే ఒక్కసారిగా భయంతో బిక్కచచ్చిపోయారు. రష్యా, అమెరికా దౌత్య సంబంధాల బలోపేతానికి ఇరు దేశాల అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్ ఫిన్‌లాండ్‌లో మంగళవారం సమావేశమయ్యారు. కార్యక్రమంలో భాగంగా పుతిన్‌తో చేయికలిపిన అనంతరం మెలానియా ముఖంలో అదో రకమైన హావభావాలు వ్యక్తమయ్యాయి. దీంతో ట్విటర్లో కామెంట్ల వర్షం కురుస్తోంది.
బహుశా పుతిన్‌కి షేక్ హాండ్ ఇవ్వడం ఆమెకు ఇష్టం లేదేమోనని కొందరు ట్వీట్ చేయగా.. క్షణ కాలంలో ముఖంలో ఎన్ని భావాలు వ్యక్తం చేయొచ్చో మెలానియాను చూసి నేర్చుకోవచ్చని మరికొందరు అంటున్నారు. తనను పుతిన్ చంపేస్తాడా అన్నంత భయంగా మెలానియా ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయని ఇంకో ట్విటరటీ పేర్కొన్నారు. తన చేతిలో ఉన్న చాకొలేట్‌ను పుతిన్ లాక్కొంటాడేమోనని మెలానియా భయపడుతోంది కావొచ్చని మరో వ్యక్తి జోక్ పేల్చారు. కాగా, ట్వీటర్లో ఈ వీడియో వైరల్ అయింది. ఫ్రీమెలానియా అనే హాష్‌టాగ్ కూడా ట్రెండ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment