వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. శుక్రవారం కోవిడ్ బారిన పడిన ట్రంప్‌కి ప్రస్తుతం ప్రయోగాత్మక చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన బాగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. తమకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రకటించిన తర్వాత ట్రంప్ దంపతులు బహిరంగంగా కనిపించలేదు. శుక్రవారం మాత్రం అధ్యక్షుడు మాస్క్ ధరించి వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చి వాషింగ్టన్ బయట ఉన్న వాల్టర్ రీడ్ మిలిటరీ ఆస్పత్రికి వెళ్లారు. ఈ క్రమంలో ట్రంప్ ఓ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. తాను ఆస్పత్రి పాలయ్యానని.. కానీ బాగానే ఉన్నానని తెలిపారు. అన్ని సక్రమంగా జరిగేలా చూస్తానన్నారు. ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా బాగానే ఉన్నారని తెలిపారు ట్రంప్. (కోవిడ్-19 : ట్రంప్ ముందున్న ముప్పు ఇదే!)
— Donald J. Trump (@realDonaldTrump) October 2, 2020
వైద్యుల సూచన మేరకు ఇక రాబోయో కొద్ది రోజులు ట్రంప్ వాల్టర్ రీడ్ ఆస్పత్రి నుంచి కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు ప్రెస్ సెక్రటరీ కైలీ మెక్‌నానీ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అధ్యక్షుడు తేలికపాటి కరోనా లక్షణాలతో బాధపడుతున్నారని.. ఆరోగ్యం క్షీణించకుండా చూసుకోవడానికి ఈ ప్రయత్నం అన్నారు. ట్రంప్ సహాయకులు మాట్లాడుతూ.. ఆయన తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నారని.. కానీ మంచి ఉత్సాహంతో ఉన్నారని.. ఆయన చాలా శక్తివంతుడు అని తెలిపారు. అంతేకాక ప్రస్తుతం క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్న రెజెనెరాన్ యాంటీబాడీ కాక్టెయిల్ డోస్ ట్రంప్‌కిచ్చారని వైట్ హౌస్ వైద్యుడు సీన్ కొన్లీ కీలక ప్రకటన చేశారు. (చదవండి: కరోనాతో 500 మంది వైద్యులు మృతి)
ట్రంప్ కోసం ప్రార్థించిన బైడెన్
ఇక ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ మాస్క్ ధరించకపోవడం వల్లే ట్రంప్‌కు ఈ పరిస్థితి తలెత్తిందని.. కాబట్టి జనాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక మంగళవారం క్లీన్‌ల్యాండ్‌లో జరిగిన తొలి చర్య సందర్భంగా దాదాపు 90 నిమిషాల పాటు ట్రంప్‌తో సన్నిహితంగా ఉన్నారు. దాంతో బైడెన్, ఆయన భార్య జిల్ శుక్రవారం పరీక్షలు చేయించుకున్నారు. తమకు నెగిటివ్ వచ్చిందని తెలిపారు. అంతేకాక ట్రంప్, అతని కుటుంబం కోసం తాను ప్రార్థిస్తున్నానని బైడెన్ తెలిపారు. ఏది ఏమయినప్పటికీ, కరోనావైరస్‌ని తీవ్రంగా పరిగణించినందుకు తాను దాని బారిన పడలేదని అమెరికన్లకు గుర్తుచేశాడు, తన ప్రత్యర్థిలా కాకుండా, తాను మాస్క్‌ని ఖచ్చితంగా వాడానన్నారు. ఇక మాస్క్ ధరించడం అంటే దేశభక్తి కలిగి ఉండటమేనని.. ఎవరికోసమే కాక మీ కోసం ఈ పని చేయాలని కోరారు బైడెన్
Comments
Please login to add a commentAdd a comment