కరోనా బారిన డొనాల్డ్ ట్రంప్ దంపతులు | US President Trump Melania test positive for Covid-19 | Sakshi
Sakshi News home page

కరోనా బారిన డొనాల్డ్ ట్రంప్ దంపతులు

Oct 2 2020 10:44 AM | Updated on Oct 2 2020 6:05 PM

US President Trump Melania test positive for Covid-19 - Sakshi

ప్రపంచాన్ని వణిస్తున్న మహమ్మారి కరోనా  వైరస్ నుంచి  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  తప్పించుకోలేకపోయారు. 

వాషింగ్టన్ :  ప్రపంచాన్ని వణిస్తున్న మహమ్మారి కరోనా  వైరస్ నుంచి  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  తప్పించుకోలేకపోయారు.  తాజాగా ఆయనకు కోవిడ్-19 నిర్ధారణ అయింది. ట్రంప్ భార్య, అమెరికా ప్రథమ  మహిళ మెలానియాకు  కూడా కరోనా సోకింది. దీంతో ఈ మేరకు ట్రంప్  శుక్రవారం ట్వీట్ చేశారు.  తాము  క్వారంటైన్ ప్రక్రియను ప్రారంభించి  తగిన చికిత్స తీసుకుంటామని ఆయన  పేర్కొన్నారు. (ఆమెకు పాజిటివ్ : ట్రంప్‌కు కరోనా పరీక్ష)

కాగా ట్రంప్  ఉన్నత సలహాదారుగా పనిచేస్తున్న హోప్ హిక్స్ కు కరోనా పాజిటివ్  తాజాగా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలోనే  తాను కూడా కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించుకోనున్నట్టు ట్రంప్ వెల్లడించిన సంగతి  తెలిసిందే.  కోవిడ్-19 పాజిటివ్ కేసులతో అమెరికా అతలాకుతలమవుతున్నతరుణంలో మాస్కును ధరించాలని, వైద్య సిబ్బంది, అధికారులు హెచ్చరించినా అధ్యక్షుడు బేఖాతరు చేస్తూ వచ్చారు. కానీ  ఆ తరువాత వాషింగ్టన్ డీసీలోని మిలిటరీ ఆసుపత్రి సందర్శన  సందర్భంగా నలుపు రంగు మాస్క్ ధరించి  అందర్నీ విస్మయపర్చారు.  కాగా కరోనాకు అత్యంత  ఎక్కువగా ప్రభావితమైన దేశాల్లో అమరికా మొదటి స్థానంలో ఉంది.  ఇప్పటివరకు 7.31 మిలియన్ల మంది వైరస్ బారిన పడగా, మరణించిన వారి సంఖ్య 2 లక్షలు దాటేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement