
ట్రంప్‌కు మెలానీయా చిన్ని షాక్!
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తలపెట్టిన మొదటి విదేశీ పర్యటనలోని పలు గిలిగింతలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి
- చేయి పట్టుకోకుండా విసిరికొట్టిన మెలానీయా
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తలపెట్టిన మొదటి విదేశీ పర్యటనలోని పలు గిలిగింతలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇజ్రాయెల్ పర్యటన ప్రారంభం సందర్భంగా ట్రంప్‌కు మెలానీయా ఓ చిన్న షాక్ ఇచ్చింది. సోమవారం ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవివ్‌లో భార్య మెలానీయాతో కలిసి ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో వచ్చారు. విమానం దిగిన అనంతరం నడుస్తూ వెళుతున్న సమయంలో భార్య మెలానీయా చేయి పట్టుకోవడానికి ట్రంప్ ప్రయత్నించారు. కానీ, ఆయన ప్రయత్నాన్ని అడ్డకుంటూ.. ట్రంప్ చేయి ఆమె విసిరికొట్టినట్టు కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిపోయింది. అంతేకాదు మంగళవారం ఇటలీ రాజధాని రోమ్ పర్యటనలోనూ ఇదేవిధంగా చేయి పట్టుకోవాలన్న ట్రంప్ ప్రయత్నాన్ని మెలానీయా తిరస్కరించడం గమనార్హం.
ట్రంప్ పట్ల మెలానీయా ప్రతిస్పందన పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయన అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత మెలానీయా ఒకింత వికారంగా పెట్టిన ముఖ కవళికల ఫొటో కూడా గతంలో వైరల్ అయింది. ఇప్పటికీ మెలానీయా వైట్‌హౌస్‌లోకి మకాం మార్చకుండా.. భర్తకు దూరంగా న్యూయార్క్‌లోనే ఉండటం కూడా ఈ దంపతుల మధ్య విభేదాలు వచ్చాయన్న వదంతులకు ఆస్కారమిస్తోంది. అమెరికా గత అధ్యక్షులు సహా పలు దేశాధినేతలు తమ జీవిత భాగస్వాములతో బహిరంగంగా సామరస్యంగా మెలుగుతుండగా.. ట్రంప్-మెలానీయా మధ్య ఆ సామరస్యం కనిపించడం లేదని ట్విట్టర్‌లో కామెంట్లు వినిపిస్తున్నాయి.
OUCHhttps://t.co/XaPL1AbCm5 pic.twitter.com/zpZGkQxDFP
— Haaretz.com (@haaretzcom) 22 May 2017