విడాకులు : మెలానియాకు భారీ మొత్తంలో.. | Melania May Get Huge Amount In Settlement If She Divorces | Sakshi
Sakshi News home page

మాజీ భార్యల కంటే మెలానియాకే ఎక్కువ

Published Thu, Nov 12 2020 10:29 AM | Last Updated on Thu, Nov 12 2020 12:44 PM

Melania May Get  Huge Amount In Settlement If She Divorces  - Sakshi

వాషింగ్టన్‌ : డొనాల్డ్‌ ట్రంప్‌ భార్య మెలానియా ట్రంప్‌ ఆయనకు విడాకులు ఇవ్వాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో  ట్రంప్‌ నుంచి విడాకులు తీసుకుంటే మెలానియాకు భారీగానే భరణం అందనుంది. కాగా 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ఎప్పుడెప్పుడు ముగింపు చెబుదామా అని మెలానియా నిముషాలు లెక్కబెడుతున్నట్టుగా ట్రంప్‌ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్‌ చెప్పినట్టుగా డెయిలీ మెయిల్‌ వెల్లడించింది. ‘ట్రంప్‌కు విడాకులు ఇవ్వడానికి ఆమె  ఆమె సిద్ధంగా ఉన్నారు. వారిద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదు. అవసరం కోసం ఇద్దరూ అలా కాలం గడిపేస్తున్నారు’ అని ఒమరోసా తెలిపారు. ఈ విలువ ($68 మిలియన్‌)  దాదాపు 500కోట్లకు పైగానే ఉంటుందని న్యాయనిపుణులు, న్యూమాన్ & రాడ్ మేనేజింగ్ భాగస్వామి జాక్వెలిన్ న్యూమాన్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. (ట్రంప్‌ వైఖరి ఇబ్బందికరమే)

వారిద్దరికి 14 ఏళ్ల బారన్ ట్రంప్ సంతాపం. కాబట్టి ఆమెకు అందే ప్రాథమిక కస్టోడియల్ హక్కులన్నీ లభిస్తాయని న్యూమాన్ తెలిపారు. డొనాల్డ్‌ ట్రంప్‌కు మెలానియా మూడవ భార్య. అయితే ట్రంప్‌ మాజీ భార్యాల కంటే ఇప్పుడు మెలానియాకు చాలా ఎక్కువ మొత్తంలో భరణం అందనుంది. మొదటి భార్యకు 14 మిలియన్‌ డాలర్లు, రెండవ భార్యకు 2 మిలియన్‌ డాలర్లను అప్పజెప్పగా తాజాగా మెలానియాకు మాత్రం 68 మిలియన్‌ డాలర్లు అందే అవకాశం ఉన్నట్లు న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. (‘నిజంగానే ఓడిపోయావు, దాన్ని అంగీకరించు’ )


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement