హ్యాపీనెస్‌ క్లాస్‌పై మెలానియా ట్వీట్‌.. | US First Lady Melania Trump recounts Happiness Class | Sakshi
Sakshi News home page

హ్యాపీనెస్‌ క్లాస్‌పై మెలానియా ట్వీట్‌..

Published Fri, Feb 28 2020 7:54 AM | Last Updated on Fri, Feb 28 2020 8:13 AM

US First Lady Melania Trump recounts Happiness Class - Sakshi

వాషింగ్టన్‌ : ఇటీవలి భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని సర్వోదయ స్కూల్‌లో హ్యాపీనెస్‌ క్లాస్‌ సెషన్‌కు హాజరవడం మరిచిపోలేని అనుభూతిగా అమెరికా తొలి మహిళ మెలానియా ట్రంప్‌ అభివర్ణించారు. తనకు స్కూల్‌లో సాదర స్వాగతం పలికిన అద్భుత చిన్నారులు, ఫ్యాకల్టీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. స్కూల్‌లో చిన్నారుల మధ్య తాను గడిపిన క్షణాలతో కూడిన వీడియోను సోషఃల్‌ మీడియాలో ఆమె షేర్‌ చేశారు. తన భర్త అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెంట భారత్‌ పర్యటనకు వచ్చిన మెలానియా ఢిల్లీలోని సౌత్‌ మోతీబాగ్‌లోని సర్వోదయ పాఠశాలను మంగళవారం సందర్శించి అక్కడి చిన్నారులతో ముచ్చటించిన సంగతి తెలసిందే. ఇరు దేశాల జెండాలను చేబూనిన విద్యార్ధులు ఆమెకు సంప్రదాయ పద్ధతుల్లో ఘన స్వాగతం పలికారు.

చదవండి : బాంగ్రా డ్యాన్స్‌కు మెలానియా ట్రంప్‌ ఫిదా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement