happiness study
-
కరోనాతో ఆనందం ఆవిరి.. హ్యాపీనెస్–2023 నివేదికలో వెల్లడి
గువాహటి: కరోనా మహమ్మారి మన భావోద్వేగాలతో ఒక ఆటాడుకుంది. మన ఆనందాలను ఆవిరి చేసేసింది. కోవిడ్ సోకిన భారతీయుల్లో 35 శాతం మంది ఇంకా తీవ్ర నిరాశ నిస్పృహల్లోనే ఉన్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఒత్తిడి, కోపం, విచారం, ఆందోళన వంటి ప్రతికూల భావోద్వేగాలు కోవిడ్ బాధితుల్లో అధికంగా ఉన్నాయని హ్యాపీప్లస్ సంస్థ విడుదల చేసిన హ్యాపీనెస్–2023 నివేదికలో వెల్లడైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లో కోవిడ్ బాధితుల్లో అత్యధికంగా 60 శాతం మంది తాము ఆనందంగా లేమని చెప్పారు. 58 శాతంతో మధ్యప్రదేశ్, 51 శాతంతో గుజరాత్, ఉత్తరప్రదేశ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కరోనాతో నిమిత్తం లేకుండా కూడా భారతీయుల్లో సంతోషం పాలు కాస్త తగ్గుతోందని నివేదిక తేల్చింది. తాము ఆనందంగా ఉన్నామని గతేడాది 70 శాతం మంది చెప్పగా ఇప్పుడది 67 శాతానికి తగ్గిందట! ప్రజల శ్రేయస్సును లెక్కల్లోకి తీసుకుంటే గతేడాది 10కి 6.84 పాయింట్లుంటే 6.08కి తగ్గింది. భారతీయ ప్రజల్లో సంతోషం తగ్గిపోవడానికి ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి, సామాజిక సంబంధాల్లో క్షీణత, ఒంటరితనం కారణాలని అధ్యయనం పేర్కొంది. -
హ్యాపీనెస్ క్లాస్‌పై మెలానియా ట్వీట్..
వాషింగ్టన్ : ఇటీవలి భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని సర్వోదయ స్కూల్లో హ్యాపీనెస్ క్లాస్ సెషన్‌కు హాజరవడం మరిచిపోలేని అనుభూతిగా అమెరికా తొలి మహిళ మెలానియా ట్రంప్ అభివర్ణించారు. తనకు స్కూల్లో సాదర స్వాగతం పలికిన అద్భుత చిన్నారులు, ఫ్యాకల్టీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. స్కూల్లో చిన్నారుల మధ్య తాను గడిపిన క్షణాలతో కూడిన వీడియోను సోషఃల్ మీడియాలో ఆమె షేర్ చేశారు. తన భర్త అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెంట భారత్ పర్యటనకు వచ్చిన మెలానియా ఢిల్లీలోని సౌత్ మోతీబాగ్‌లోని సర్వోదయ పాఠశాలను మంగళవారం సందర్శించి అక్కడి చిన్నారులతో ముచ్చటించిన సంగతి తెలసిందే. ఇరు దేశాల జెండాలను చేబూనిన విద్యార్ధులు ఆమెకు సంప్రదాయ పద్ధతుల్లో ఘన స్వాగతం పలికారు. చదవండి : బాంగ్రా డ్యాన్స్‌కు మెలానియా ట్రంప్ ఫిదా -
మెలానియా కార్యక్రమానికి కేజ్రీకి పిలుపేది?
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా చేపట్టనున్న పాఠశాల సందర్శన కార్యక్రమానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలకు ఆహ్వానం అందలేదు. ఆ జాబితా నుంచి వీరి పేర్లను తొలగించినట్లు అమెరికా ఎంబసీ శనివారం సాయంత్రం ఢిల్లీ యంత్రాంగానికి తెలియజేసింది. కేజ్రీవాల్ ప్రారంభించిన ‘హ్యాపీనెస్ క్లాసెస్’ను పరిశీలించేందుకే మెలానియా పాఠశాలను సందర్శిస్తున్నారు. ఈ సందర్శనకు కేజ్రీవాల్ హాజరై హ్యాపీనెస్ క్లాసెస్ గురించి వివరించాల్సి ఉంది. అయితే తాజాగా ఆయన పేరును తొలగించడంతో వాటి గురించి ఎవరు చెబుతారన్న సందేహం వ్యక్తమవుతోంది. ఢిల్లీ పాఠశాలల్లో మార్పులు తీసుకొచ్చింది తామేనంటూ సిసోడియా వరుస ట్వీట్లు చేశారు. తాము ప్రారంభించిన హ్యాపీనెస్ క్లాసులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని ప్రపంచమే ఉబలాటపడుతోందని అన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం గురించి ప్రభుత్వం కాకపోతే మరెవరు చెబుతారంటూ ఆప్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది బీజేపీ పనే: ఆప్ కార్యక్రమం నుంచి కేజ్రీవాల్, సిసోడియాల పేర్లు తొలగించడంపై ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరధ్వాజ్ స్పందించారు. ఇలాంటి కార్యక్రమాలు జరిగినపుడు స్థానిక అధికారులు హాజరు కావడం ప్రొటోకాల్ అని చెప్పారు. కేంద్రంలో బీజేపీ ఉండటం వల్లే వారిద్దరి పేర్లు తొలగించినట్లు ఆయన ఆరోపించారు. కేజ్రీవాల్, సిసోడియాల పేర్లు తొలగించాల్సిందిగా తాము యూఎస్ ఎంబసీని కోరలేదని బీజేపీ అంటోందని, అలా చెప్పడంలోనే ఏదో మతలబు ఉందని ఆరోపించారు. -
ఆనందానికి అర్థం ప్రేమేనా....!
ఆనందం అంటే ఏమిటి? ఆనందంగా జీవించడం ఎలా? మనిషి జీవనశైలికి, ఆనందానికి సంబంధం ఉందా? డబ్బులుంటే ఆనందం ఉంటుందా? సమాజంలో హోదాను బట్టి ఆనందం పెరుగుతుందా? ఆనందానికి ఆరోగ్యానికి సంబంధం ఏమిటి? ఆనందంగా ఉన్నవాళ్లు ఎక్కువకాలం జీవిస్తారా? ఆరోగ్యంగా ఉన్నవాళ్లు ఎక్కువ కాలం జీవిస్తారా? చివరకు ఆనందమయ జీవితం వెనకనుండే అసలు రహస్యం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కనుగొనేందుకు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఒక మానవ బృందంపై ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 79 ఏళ్లుగా అధ్యయనం చేస్తున్నారు. ఈ మహా అధ్యయనానికి దశాబ్దాల పాటు కోట్లాది రూపాయలను ఖర్చుపెట్టి ఇప్పటికి తేల్చిందేమంటే.. ఆనందమయ జీవితానికి అర్థం ప్రేమట. ప్రేమంటేనే జీవితాలు ఆనందంగా ఉంటాయట. ఈ ప్రేమ భార్యాభర్తల అనుబంధాల మధ్యనే కాదు, తండ్రీ కొడుకులు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు, అన్నా చెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధాల మధ్య కూడా ప్రేముండటమే అనుబంధమట. స్నేహితుల మధ్య అనుబంధానికి కూడా ప్రేమే కారణమట. ప్రేమతోనే ఆనందం వస్తుందని, అదే జీవన పరమార్థమని, ఆనందానికి డబ్బులు, హోదాలు ప్రాతిపదిక కావని చెబుతున్నారు. ఈ అధ్యయనం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇంతటితో ఈ అధ్యయనాన్ని ఆపేయాలని కూడా సూచిస్తున్నారు. ఈ విమర్శలను, సూచనలు దృష్టిలో పెట్టుకొనేమో అమెరికా ఫెడరల్ ప్రభుత్వం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈ ఏడాది అధ్యయన కేటాయింపుల్లో పది శాతం కోత విధించింది. రానున్న సంవత్సరాల్లో మరింత కోత విధించే అవకాశాలు ఉన్నాయి. కేవలం తెల్లవారిపైనే, అందులోనూ అమెరికా మాజీ అధ్యక్షుడు జేఎఫ్ కెన్నడీ కుటుంబం లాంటి జీవితాలను అధ్యయనం చేయడం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వివిధ జాతులకు చెందిన ప్రజల జీవితాలను అధ్యయనం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి గానీ, ఇదేమి అధ్యయనం అని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. 1938లో నుంచి తాము చేస్తున్న అధ్యయనంలో మొదటితరానికి చెందిన వారిలో కొందరు మరణించారని, రెండో తరం, మూడో తరంపై కూడా తమ అధ్యయనాలు కొనసాగుతున్నాయని అధ్యయనానికి నాయకత్వం వహిస్తున్న రాబర్ట్ వాల్డింగర్ తెలిపారు. తరాలను బట్టి ఆనందానికి అర్థం మారుతుందని, అలాంటి మార్పును అధ్యయనం చేయడానికి, భవిష్యత్ తరాలు ఎలా ఉంటాయో అంచనా వేయడానికి తమ అధ్యయనాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.