మంత్రి చూసిన ఫొటోలు ఎవరివో తెలుసా? | Karnataka Minister, caught ‘watching porn’, was looking at Melania Trump’s photos | Sakshi
Sakshi News home page

మంత్రి చూసిన ఫొటోలు ఎవరివో తెలుసా?

Nov 16 2016 10:28 AM | Updated on Sep 4 2017 8:15 PM

మంత్రి చూసిన ఫొటోలు ఎవరివో తెలుసా?

మంత్రి చూసిన ఫొటోలు ఎవరివో తెలుసా?

తలంపులు తెచ్చే పనిచేసి అడ్డంగా దొరికిపోయిన కర్ణాటక మంత్రి తన్వీర్‌ సేఠ్‌ వ్యవహారంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది.

బెంగళూరు: తలంపులు తెచ్చే పనిచేసి అడ్డంగా దొరికిపోయిన కర్ణాటక పాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి  తన్వీర్‌ సేఠ్‌ వ్యవహారంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. అధికారిక కార్యక్రమంలో ఉండగా మొబైల్‌ ఫోన్‌ లో బూతుబొమ్మలు చూస్తూ మంత్రి మీడియాకు చిక్కారు.

అయితే ఆయన అంత ఆసక్తిగా వీక్షించిన ఫొటోలు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి మెలానియాకు చెందినవని వెల్లడైంది. మెలానియా మోడలింగ్‌ చేసినప్పటి ఫొటోలను చూస్తూ తన్వీర్‌ సేఠ్‌ కెమెరా కంటపడడంతో ఆయనపై విమర్శలు చెలరేగాయి. ట్రంప్‌ విజయం సాధించడంతో మెలానియా పాత ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విరివిరిగా పోస్ట్‌ అవుతున్నాయి. ట్రంప్‌ ను​ పెళ్లాడకముందు మెలానియా మోడలింగ్‌ చేశారు.

తన్వీర్‌ సేఠ్‌ తన మొబైల్‌ ఫోన్‌ లో మెలానియా ఫొటోలు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారని ’టైమ్స్‌ ఆఫ్ ఇండియా’  తెలిపింది. ఈ తతంగాన్ని చిత్రీకరించిన జర్నలిస్ట్తో పాటు కెమెరామెన్పై మంత్రి తన్వీర్‌ సేఠ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తన్వీర్‌ సేఠ్‌ ను కర్ణాటక సీఎం సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర వివరణ అడిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement