Karnataka education minister
-
మంత్రి చూసిన ఫొటోలు ఎవరివో తెలుసా?
బెంగళూరు: తలంపులు తెచ్చే పనిచేసి అడ్డంగా దొరికిపోయిన కర్ణాటక పాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి తన్వీర్ సేఠ్ వ్యవహారంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. అధికారిక కార్యక్రమంలో ఉండగా మొబైల్ ఫోన్ లో బూతుబొమ్మలు చూస్తూ మంత్రి మీడియాకు చిక్కారు. అయితే ఆయన అంత ఆసక్తిగా వీక్షించిన ఫొటోలు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియాకు చెందినవని వెల్లడైంది. మెలానియా మోడలింగ్ చేసినప్పటి ఫొటోలను చూస్తూ తన్వీర్ సేఠ్ కెమెరా కంటపడడంతో ఆయనపై విమర్శలు చెలరేగాయి. ట్రంప్ విజయం సాధించడంతో మెలానియా పాత ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విరివిరిగా పోస్ట్ అవుతున్నాయి. ట్రంప్ ను పెళ్లాడకముందు మెలానియా మోడలింగ్ చేశారు. తన్వీర్ సేఠ్ తన మొబైల్ ఫోన్ లో మెలానియా ఫొటోలు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారని ’టైమ్స్ ఆఫ్ ఇండియా’ తెలిపింది. ఈ తతంగాన్ని చిత్రీకరించిన జర్నలిస్ట్తో పాటు కెమెరామెన్పై మంత్రి తన్వీర్ సేఠ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తన్వీర్ సేఠ్ ను కర్ణాటక సీఎం సిద్దరామయ్య, పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర వివరణ అడిగారు. -
నీలిచిత్రాలు చూస్తూ అడ్డంగా దొరికిన మంత్రి
బెంగళూరు: కర్ణాటక పాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి మంత్రి తన్వీర్ సేఠ్ తలంపులు తెచ్చే పనిచేసి అడ్డంగా దొరికిపోయారు. మొబైల్ ఫోన్ లో నీలిచిత్రాలు చూస్తూ మీడియా కంటపడ్డారు. టిప్పు జయంతి సందర్భంగా గురువారం రాయచూరలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ ఘనకార్యం చేశారు. ఈ విషయం అన్ని వార్తా చానళ్లలో ప్రసారం కావడంతో సిద్ధరామయ్య సర్కారు ఇరకాటంలో పడింది. తన చర్యను తన్వీర్ సేఠ్ సమర్థించుకున్నారు. ‘తను ఇల్లు విడిచి మూడు నెలలు అయింద’ని నిసిగ్గుగా సమాధానం ఇచ్చారు. తర్వాత మాట మార్చారు. మైసూరుకు చెందిన తాను అక్కడ జరిగిన టిప్పు కార్యక్రమాలకు సంబంధించిన వీడియో చూసినట్టు బుకాయించారు. ఈ విషయంపై సీఎం సిద్ధరామయ్య, హోంమంత్రి పరమేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ పూర్తి సమాచారం తెలుసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. తన్వీర్ సేఠ్ వ్యవహారంపై సిద్ధరామయ్యను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ నివేదిక అడినట్టు సమాచారం. కాగా, రాయచూర నుంచి కలబుర్గి జిల్లా చించోళి వద్ద జరగనున్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళుతున్న తన్వీర్ సేఠ్ ను బీజేపీ కార్యకర్తలు ఘోరావ్ చేశారు. వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.