నీలిచిత్రాలు చూస్తూ అడ్డంగా దొరికిన మంత్రి | Karnataka education minister caught watching porn during Tipu Jayanti function | Sakshi
Sakshi News home page

నీలిచిత్రాలు చూస్తూ అడ్డంగా దొరికిన మంత్రి

Published Fri, Nov 11 2016 9:24 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

నీలిచిత్రాలు చూస్తూ అడ్డంగా దొరికిన మంత్రి

నీలిచిత్రాలు చూస్తూ అడ్డంగా దొరికిన మంత్రి

బెంగళూరు: కర్ణాటక పాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి మంత్రి తన్వీర్‌ సేఠ్‌ తలంపులు తెచ్చే పనిచేసి అడ్డంగా దొరికిపోయారు. మొబైల్‌ ఫోన్‌ లో నీలిచిత్రాలు చూస్తూ మీడియా కంటపడ్డారు. టిప్పు జయంతి సందర్భంగా గురువారం రాయచూరలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ ఘనకార్యం చేశారు. ఈ విషయం అన్ని వార్తా చానళ్లలో ప్రసారం కావడంతో సిద్ధరామయ్య సర్కారు ఇరకాటంలో పడింది.

తన చర్యను తన్వీర్‌ సేఠ్‌ సమర్థించుకున్నారు. ‘తను ఇల్లు విడిచి మూడు నెలలు అయింద’ని నిసిగ్గుగా సమాధానం ఇచ్చారు. తర్వాత మాట మార్చారు. మైసూరుకు చెందిన తాను అక్కడ జరిగిన టిప్పు కార్యక్రమాలకు సంబంధించిన వీడియో చూసినట్టు బుకాయించారు. ఈ విషయంపై సీఎం సిద్ధరామయ్య, హోంమంత్రి పరమేశ్వర్‌ మీడియాతో మాట్లాడుతూ పూర్తి సమాచారం తెలుసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. తన్వీర్‌ సేఠ్‌ వ్యవహారంపై సిద్ధరామయ్యను రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ నివేదిక అడినట్టు సమాచారం.

కాగా, రాయచూర నుంచి కలబుర్గి జిల్లా చించోళి వద్ద జరగనున్న ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళుతున్న తన్వీర్ సేఠ్‌ ను బీజేపీ కార్యకర్తలు ఘోరావ్‌ చేశారు. వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement