
సాక్షి, బెంగళూరు: అండర్ వరల్డ్ డాన్‌గా పేరు పొందిన రవి పూజారి నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన మాట వాస్తవమేనని, అయితే ఇలాంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని మంత్రి తన్వీర్ సేఠ్ అన్నారు. బుధవారం ఆయన మైసూరులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రవి పూజారి అనే వ్యక్తి ఫోన్ చేసి రూ. 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, ఈ మేరకు ఒక మెసేజ్ కూడా వచ్చిందన్నారు. ఇప్పటికే ఈ విషయం హోం మంత్రికి, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశానని, సీఎం సిద్ధరామయ్య దృష్టికి కూడా తీసుకువెళ్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment