Ravi Pujari
-
మరోసారి వార్తల్లోకి గ్యాంగ్‌స్టర్ రవి పూజారి
న్యూఢిల్లీ : గత 20 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న మాఫియా గ్యాంగ్ స్టర్ రవి పూజారిని త్వరలోనే భారత్‌కు రప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా భారత ప్రభుత్వం అతన్ని తిరిగి దేశానికి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుందని సమాచారం అందింది. ఈ మేరకు రా అధికారుల సహాయంతో కర్నాటక పోలీసులు రవి పూజారీని తీసుకువచ్చేందుకు సెనెగల్ దేశానికి వెళ్లారు. ఇదే విషయమై కర్నాటక పోలీసులు మాట్లాడుతూ.. ఒక్క బెంగళూరులోనే రవి పుజారిపై 39 కేసులు ఉన్నాయి. వాటిలో 2007లో షబ్నమ్ డెవలపర్స్ యజమానులు శైలాజా, రవిల హత్య కేసు తో పాటు మంగళూరులో 36, ఉడిపిలో 11, మైసూరు, హుబ్బల్లి-ధార్వాడ్, కోలార్, శివమొగ్గలో ఒక్కో కేసు ఉన్నట్లు తెలిపారు.(చదవండి : మాఫియా డాన్ రవి పుజారీ అరెస్ట్) 20 ఏళ్ల క్రితం ఇండియా నుంచి పారిపోయిన రవి పూజారి ఆఫ్రికాలోని సెనెగల్ దేశానికి వెళ్లి ఆంటోని ఫెర్నాండెజ్‌గా పేరు మార్చుకున్నాడు. ఆ తర్వాత పాస్‌పోర్ట్ సంపాదించి తన కుటుంబాన్ని కూడా సెనెగల్‌కు రప్పించి పలుచోట్ల రెస్టారెంట్లు నడుపుతూ జీవనం సాగించాడు. అయితే గతేడాది జనవరి 2019లో బార్బర్ షాపుకు వెళ్లిన రవి పూజారిపై అనుమానించిన సెనెగల్ పోలీసులు అదుపులోకి తీసుకొని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. బెయిల్‌పై బయటికి వచ్చిన రవి పూజారి అక్కడి నుంచి వేరే చోటికి పారిపోయాడు. కాగా అప్పటినుంచి కనిపించకుండా పోయిన రవి పూజారి భారతదేశానికి అప్పగించేందుకు సెనెగల్ సుప్రీంకోర్టు ఒప్పుకోవడంతో పోలీసులు అతని కోసం సెనెగల్ వెళ్లారు.(కోట్లు ఇవ్వాలంటూ మంత్రికి డాన్ బెదిరింపు కాల్!) కాగా గతంలో ఛోటారాజన్, దావూద్ ఇబ్రహీంలతో కలసి పనిచేసిన పుజారీ.. తర్వాత సొంత గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకొని హత్యలు,బెదిరింపులకు పాల్పడినట్లు తేలింది. రవి పూజారి తనను బెదిరించాడని సినీ నిర్మాత మహేష్ భట్ అప్పట్లో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడం పెను సంచలనంగా మారింది.ఆ తర్వాత భట్ ను చంపడానికి కుట్ర పన్నిన రవి పూజారి ముఠాలోని కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. -
మాఫియా డాన్ రవి పుజారీ అరెస్ట్
ముంబై: భారత అధికారులకు గత 15 ఏళ్లుగా దొరక్కుండా తిరుగుతున్న మాఫియా డాన్ రవి పుజారి ఎట్టకేలకు దొరికాడు. ఆఫ్రికా దేశమైన సెనెగల్ రాజధాని డకార్‌లో పోలీసులు పుజారీని జనవరి 22న అరెస్ట్ చేశారు. ఈ విషయమై ముంబై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పుజారీ అనుచరులు విజయ్ రోడ్రిక్స్, ఆకాశ్ శెట్టిలను ఇటీవల ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. వీరిని విచారించగా, పుజారీ సెనెగల్‌లో తలదాచుకుంటున్నట్లు తేలిందన్నారు. బిల్డర్లు, సినీ ప్రముఖులను డబ్బుల కోసం ఈ గ్యాంగ్ బెదిరిస్తుందన్నారు. పుజారీని భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కర్ణాటకకు చెందిన పుజారీపై డజనుకుపైగా హత్య, బెదిరింపుల కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. తొలుత ఛోటారాజన్, దావూద్ ఇబ్రహీంతో కలసి పనిచేసిన పుజారీ.. తర్వాత సొంతగ్యాంగ్ను ఏర్పాటు చేసుకున్నాడు. -
కోట్లు ఇవ్వాలంటూ మంత్రికి డాన్ బెదిరింపు కాల్!
సాక్షి, బెంగళూరు: అండర్ వరల్డ్ డాన్‌గా పేరు పొందిన రవి పూజారి నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన మాట వాస్తవమేనని, అయితే ఇలాంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని మంత్రి తన్వీర్ సేఠ్ అన్నారు. బుధవారం ఆయన మైసూరులోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రవి పూజారి అనే వ్యక్తి ఫోన్ చేసి రూ. 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, ఈ మేరకు ఒక మెసేజ్ కూడా వచ్చిందన్నారు. ఇప్పటికే ఈ విషయం హోం మంత్రికి, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశానని, సీఎం సిద్ధరామయ్య దృష్టికి కూడా తీసుకువెళ్తానన్నారు. -
'షారుక్ కు మాఫియా బెదిరింపులు రాలేదు'
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కు మాఫియా నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయన్న వార్తల్ని ఆయన సన్నిహితుడొకరు ఖండించారు. మాఫియా నుంచి షారుక్ కు ఎలాంటి బెదిరింపు కాల్స్ రాలేదని ఆయన స్పష్టం చేశారు. రవి పూజారి నుంచి షారుక్ కు బెదిరింపులు రావడంతో ఆయన నివాసం మన్నత్ వద్ద పోలీసులు భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారని మీడియా కథనాల్ని వెల్లడించింది. షారుక్ కు బెదిరింపులు వచ్చాయనే వార్తలో వాస్తవం లేదు. అలాంటి రూమర్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో ఆశ్చర్యం కలిగిస్తున్నాయి అని బాలీవుడ్ బాద్ షా సన్నిహితుడొకరు అన్నారు. ఈ వ్యవహారంపై కథనంపై పోలీసులను సంప్రదించగా.. గత కొద్దికాలంగా షారుక్ నివాసం వద్ద పోలీసుల భద్రత ఏర్పాటు చేశాం. ప్రస్తుతం దానికి గురించి పెద్దగా మాట్లాడుకోవడం అంత అవసరమా? అంటూ ప్రశ్నించారు. మోరానీ సోదరులపై జరిగిన కాల్పుల నేపథ్యంలో షారుక్ కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయనే రూమర్లు బయటకు వచ్చాయని పోలీసులు తెలిపారు. మోరానీ బ్రదర్స్ తో కలిసి షారుక్ గతంలో టెంప్టేషన్ రిలోడెడ్ అనే టూర్ నిర్వహించారు. -
వాడియా తండ్రికి రవి పూజారి బెదిరింపులు
ముంబై: అండర్ వరల్డ్ డాన్ రవి పూజారి నుంచి మొబైల్ ఫోన్ కు బెదిరింపు మెసేజ్ లు వస్తున్నాయని వాడియా గ్రూప్ చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ముంబై డిప్యూటి పోలీస్ కమిషనర్ మహేశ్ పటేల్ తెలిపారు. రవి పూజారి నుంచి బెదిరింపు మెసెజ్ వస్తున్నట్టు పారిశ్రామిక వేత్త నుస్లీ వాడియా కార్యదర్శి ఎన్ఎమ్ జోషి మార్గ్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఫిర్యాదు చేసినట్టు మహేశ్ పటేల్ చెప్పారు. నెస్లీ వాడియా కార్యదర్శి పేరు చెప్పడానికి పోలీసులు నిరాకరించారు. అయితే నెస్లీ వాడియా ఫోన్ కు వచ్చాయా లేక కార్యదర్శి మొబైల్ వచ్చాయా అనే విషయాన్ని పోలీసులు ధృవీకరించలేదు. నెస్లీవాడియా కుమారుడు నెస్ వాడియాపై బాలీవుడ్ నటి, మాజీ ప్రేయసి ప్రీతి జింటా మే 30 తేదిన ఐపీఎల్ మ్యాచ్ సందర్బంగా లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేయడంతో వాడియా కుటుంబ పేరు మీడియాలో వినిపిస్తోంది. నెస్ వాడియా, ప్రీతి జింటాలకు కేసు నేపథ్యంలో బెదిరింపులు వచ్చాయా అనే విషయంపై ఓ అవగాహనకు రాలేదని పోలీసులు తెలిపారు. తాజా ఫిర్యాదుపై వాడియా గ్రూప్ ప్రతినిధులు స్పందించడానికి అందుబాటులోకి రానట్టు తెలుస్తోంది.