'షారుక్ కు మాఫియా బెదిరింపులు రాలేదు'
'షారుక్ కు మాఫియా బెదిరింపులు రాలేదు'
Published Tue, Aug 26 2014 7:02 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కు మాఫియా నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయన్న వార్తల్ని ఆయన సన్నిహితుడొకరు ఖండించారు. మాఫియా నుంచి షారుక్ కు ఎలాంటి బెదిరింపు కాల్స్ రాలేదని ఆయన స్పష్టం చేశారు. రవి పూజారి నుంచి షారుక్ కు బెదిరింపులు రావడంతో ఆయన నివాసం మన్నత్ వద్ద పోలీసులు భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారని మీడియా కథనాల్ని వెల్లడించింది. షారుక్ కు బెదిరింపులు వచ్చాయనే వార్తలో వాస్తవం లేదు. అలాంటి రూమర్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో ఆశ్చర్యం కలిగిస్తున్నాయి అని బాలీవుడ్ బాద్ షా సన్నిహితుడొకరు అన్నారు.
ఈ వ్యవహారంపై కథనంపై పోలీసులను సంప్రదించగా.. గత కొద్దికాలంగా షారుక్ నివాసం వద్ద పోలీసుల భద్రత ఏర్పాటు చేశాం. ప్రస్తుతం దానికి గురించి పెద్దగా మాట్లాడుకోవడం అంత అవసరమా? అంటూ ప్రశ్నించారు. మోరానీ సోదరులపై జరిగిన కాల్పుల నేపథ్యంలో షారుక్ కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయనే రూమర్లు బయటకు వచ్చాయని పోలీసులు తెలిపారు. మోరానీ బ్రదర్స్ తో కలిసి షారుక్ గతంలో టెంప్టేషన్ రిలోడెడ్ అనే టూర్ నిర్వహించారు.
Advertisement
Advertisement