ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు దేశ ప్రధానులను సైతం వణికిస్తోంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భార్య సోఫీ గ్రెగోయిర్ ట్రూడో కూడా ఈ వైరస్ బారిన పడింది. తన భార్య సోఫీకి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన ట్విట్టర్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తనతో సహా ముగ్గురు పిల్లలకు కరోనా లక్షణాలు లేవని జస్టిన్ ట్రూడో తెలిపారు. కరోనా దృష్యా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను తన ఇంటి దగ్గర నుంచే ట్రూడే నిర్వహిస్తున్నారు. ప్రపంచ నాయకులతో ముఖ్యమైన చర్చలను తన ఇంటి నుంచే కొనసాగిస్తున్నారు.
అన్ని కార్యక్రమాలు ఇంటి నుంచే నిర్వహించడం వల్ల ప్రజా సమస్యలు తీర్చడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ట్రుడో చెప్పినట్లు బ్రిటన్‌కు చెందిన జాతీయ మీడియా పేర్కొంది. కెనడా ప్రభుత్వం అన్ని విదేశీ కార్యక్రమాలను రద్దు చేసుకుందని.. కేవలం పరిమిత సంఖ్యలో విమానాశ్రయాలకు మాత్రమే ప్రభుత్వం అవకాశం కల్పించిందని అధికారులు తెలిపారు. కరోనా వల్ల కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌కు 5 వారాలు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
చదవండి: అసలు ఆ ప్రమాదం జరిగేదే కాదు!
Comments
Please login to add a commentAdd a comment