టొరంటో: దాదాపు 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకబోతున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దంపతులు బుధవారం ప్రకటించారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఈ కఠిన నిర్ణయానికి వచ్చినట్టు ట్రూడో, ఆయన భార్య సోఫీ గ్రెగరీ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేశారు. ఈ జంట ఇప్పటికే తమ విడాకుల సంబంధ చట్టపర అంగీకార పత్రంపై సంతకాలు చేసినట్టు ప్రధాని కార్యాలయం పేర్కొంది.
వారు 2005 ఏడాదిలో వివాహం చేసుకున్నారు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అధికారంలో ఉంటూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన రెండో కెనడా ప్రధాని ట్రూడో. ఆయన తండ్రి, మాజీ ప్రధాని పియరీ ట్రూడో కూడా విడాకులు తీసుకున్నారు. దేశంలో అత్యంత ప్రభావశీల వ్యక్తిగా పేరొందిన తండ్రి నుంచి జస్టిన్ రాజకీయ వారసత్వం పుణికిపుచ్చుకున్నారు. 2015లో ప్రధానిగా పగ్గాలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment