న్యూఢిల్లీ: కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అందరికీ సమానంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న దేశాల్లో కెనడా కూడా చేరింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో, స్పెయిన్, న్యూజిలాండ్, దక్షిణకొరియా, ఇథియోపియా సహా మరో మూడు దేశాలకు చెందిన దేశాధినేతలతో కలిసి రాసిన ఆర్టికల్ వాషింగ్టన్ పోస్టులో ప్రచురితమైంది. (కరోనా వ్యాక్సిన్‌పై ‘ఆక్స్ఫర్డ్’ ముందడుగు!)
‘వ్యాక్సిన్లు ప్రాణాలను కాపాడతాయి. అందుకోసమే ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు ప్రయత్నిస్తోంది. వ్యాక్సిన్ ఎవరు కనుగొన్నా.. అది అందరికీ చేరాలి’ అంటూ ట్రూడో ట్వీట్ కూడా చేశారు. ఈ మేరకు తనతో పాటు ఆర్టికల్ రాసిన ఇతర దేశాధినేతలను ట్యాగ్ చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కోవిడ్–19 వ్యాక్సిన్ మానవ ప్రయోగాల్లో మూడో దశకు, ప్రాథమిక టెస్టుల్లో మోడర్నా వ్యాక్సిన్ పని తీరు మెరుగ్గా ఉందని వార్తలు వచ్చిన మరుసటి రోజే ట్రూడో ఈ కామెంట్లు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 100కిపైగా వ్యాక్సిన్లను కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధం చేస్తున్నారు. (మార్చి నెలకు ఆరు కోట్ల కేసులు..!)
Comments
Please login to add a commentAdd a comment