గత నెలలో ట్రోఫీ నెగ్గిన ఆనందంలో హాకీ జట్టు
ఒట్టావా : కెనడాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఐస్ హాకీ జట్టుకు చెందిన 13 మంది ఆటగాళ్లు, ఓ డ్రైవర్ మృత్యువాత పడ్డారు. దీంతో కెనడా క్రీడా ప్రపంచంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కెనడాలోని సస్‌కచివాన్ రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. కెనడా అధికారులు శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు.
రాయల్ కెనడా మౌంటెడ్ పోలీసుల కథనం ప్రకారం.. హంబోల్డ్ బ్రాంకోస్ జట్టుకు చెందిన జూనియర్ ఐస్ హాకీ ఆటగాళ్లు, సిబ్బంది మొత్తం కలిపి 28 మంది ఓ బస్సులో వెళ్తున్నారు. సస్‌కచివాన్‌లోని టిస్డేల్‌లో హైవేపై వెళ్తుండగా వీరి వెళ్తున్న బస్సు, ఓ ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో 13 మంది ఆటగాళ్లు, డ్రైవర్ మృచెందగా, మరో 14 మంది గాయపడ్డారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
ప్రధాని సంతాపం
ఐస్ హాకీ ఆటగాళ్లు దుర్మరణం చెందడంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. అసలు ఇలాంటి ఘటన జరుగుతుందని ఊహించలేకపోయానంటూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment