Trudeau: మళ్లీ భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు | 'India must take this seriously': Trudeau on Canada's Nijjar charges after US case | Sakshi
Sakshi News home page

సీరియస్‌గా తీస్కోండి.. మళ్లీ భారత్‌పై కెనడా ప్రధాని ట్రూడో తీవ్ర వ్యాఖ్యలు

Published Thu, Nov 30 2023 9:24 AM | Last Updated on Thu, Nov 30 2023 10:16 AM

India must take this serious: Trudeau on Canada Nijjar charges - Sakshi

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య చెలరేగిన దౌత్యపరమైన వివాదం.. మళ్ల రాజుకునేలా కనిపిస్తోంది. తాజాగా భారత్​ను ఉద్దేశించి కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజ్జర్​ హత్య కేసు దర్యాప్తులో భారత్​ నుంచి తాము మరింత సహకారం కోరుతున్నట్లు ​ ట్రూడో పేర్కొన్నారు. భారత్‌ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని.. కేసు దర్యాప్తుకు ఆదేశ​ సహాకారం అవసరమని చెప్పారు. 

కాగా సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్​ సింగ్​ పన్నూను అమెరికాలో హత్య చేసేందుకు జరిగిన కుట్రను భగ్నం చేసినట్లు అగ్రరాజ్యం ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి పనిచేసిన 52 ఏళ్ల నిఖిల్ గుప్తా.. పన్నూ​ను చంపడానికి కుట్ర పన్నినట్లు అమెరికా న్యాయ శాఖ బుధవారం తెలిపింది. ఈ క్రమంలో ట్రూడో మరోసారి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం

ఖలిస్తానీ వేర్పాటువాదుల హత్యకు కుట్ర విషయంలో యూఎస్ నుంచి వస్తున్న వార్తల గురించి తాము మొదటి నుంచి మాట్లాడుతున్నామని ట్రూడో ఈ సందర్భంగా అన్నారు. భారత్​ దీనిని తీవ్రంగా పరిగణించాలని తెలిపారు. మరోవైపు నిజ్జర్​ హత్య కేసులో కొనసాగుతున్న దర్యాప్తు లో భారత్​ మరింత పారదర్శకంగా వ్యవహరించాలని కోరుతున్నట్లు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ  తెలిపారు.  భారత్​ తమ సహకారాన్ని పెంచాలని సూచించారు. 

ఇదిలా ఉండగా ఈ ఏడాది జూన్​లో ఖలిస్తానీ వేర్పాటువాదీ హర్​దీప్​ సింగ్​నిజ్జర్​ కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వెనక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా 
ప్రధాని జస్టిన్​ ట్రూడో ఆరోపించడంతో ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తలకు దారితీశాయి. అయితే ట్రూడో వ్యాఖ్యలను బారత్​ తీవ్రంగా ఖండించింది. కెనడా ఆరోపణల్లో ఎలాంటి వాస్తం లేదని, నిరాధారమైనమైనవని కొట్టిపారేసింది. 
చదవండి: ‘న్యూయార్క్‌లో హత్యకు కుట్ర పన్నింది ఆ భారతీయుడే’!


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement